International Yoga Day: తాజ్ మహల్, ఆగ్రా కోట సహా స్మారక చిహ్నాల్లో నేడు ప్రవేశం ఉచితం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేడు పర్యాటకులు తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రితో పాటు దేశంలోని ఇతర స్మారక చిహ్నాల ప్రవేశ రుసుమును చెల్లించే అవసరం లేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) తెలిపింది.

Taj Mahal
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేడు పర్యాటకులు తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రితో పాటు దేశంలోని ఇతర స్మారక చిహ్నాల ప్రవేశ రుసుమును చెల్లించే అవసరం లేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) తెలిపింది. ఏఎస్ఐ ఆధ్వర్యంలోని స్మారక చిహ్నాలను చూసేందుకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పింది. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా నేడు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.
International Yoga Day: యోగా దినోత్సవంలో పాల్గొని ఆసనాలు వేసిన మోదీ
మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రిలోని పంచ్ మహల్ వద్ద కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యారు. కాగా, దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుగుతోంది. ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రిషికేశ్‌లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి యోగా దినోత్సవంలో పాల్గొని, ఆసనాలు వేశారు.