Zakir Naik: అదంతా వారి తప్పుడు ప్రచారం.. మేము జకీర్ నాయక్‌ను ఆహ్వానించలేదు: ఖతర్

భారత్ నుంచి పారిపోయిన ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ను ఫిఫా వరల్డ్ కప్-2022 సందర్భంగా తమ దేశానికి రావాలని తాము అధికారికంగా ఆహ్వానించలేదని భారత్ కు ఖతర్‌ తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్-2022 వేళ జకీర్ నాయక్ ను ఖతర్ ఆహ్వానించిందని వార్తలు రావడంతో దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నగదు అక్రమ చలామణీకి పాల్పడడం, విద్వేష పూరిత ప్రసంగాలు చేశాడని జకీర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

Zakir Naik: అదంతా వారి తప్పుడు ప్రచారం.. మేము జకీర్ నాయక్‌ను ఆహ్వానించలేదు: ఖతర్

Updated On : November 23, 2022 / 9:07 PM IST

Zakir Naik: భారత్ నుంచి పారిపోయిన ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ను ఫిఫా వరల్డ్ కప్-2022 సందర్భంగా తమ దేశానికి రావాలని తాము అధికారికంగా ఆహ్వానించలేదని భారత్ కు ఖతర్‌ తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్-2022 వేళ జకీర్ నాయక్ ను ఖతర్ ఆహ్వానించిందని వార్తలు రావడంతో దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నగదు అక్రమ చలామణీకి పాల్పడడం, విద్వేష పూరిత ప్రసంగాలు చేశాడని జకీర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

ఆయన ప్రసంగాల ద్వారా యువత తప్పుడు బాట పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, చర్యలకు సిద్ధమవుతుండడంతో ఆయన భారత్ నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనను ఖతర్ ఆహ్వానించడం పట్ల విమర్శలు వచ్చాయి. దీనిపైనే భారత్ కు ఖతర్ వివరణ ఇచ్చింది. తాము జకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని చెప్పింది.

తాము జకీర్ నాయక్ ను ఆహ్వానించామంటూ కొన్ని దేశాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. భారత్-ఖతర్ మధ్య ఉన్న ధ్వైపాక్షిక బంధాన్ని దెబ్బతీసేందుకే ఇటువంటి ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..