AP : కానిస్టేబులే దొంగ.. 16లక్షలు నొక్కేసి జంప్..!
బీరువాలో దాచిన సొమ్ములో కొంత నగదును నూజివీడు స్టేషన్ కానిస్టేబుల్ జనార్ధన్ నాయుడు కాజేసి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు.

Nuzvid
Nuzvid : కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగింది. స్టేషన్ కానిస్టేబులే ఇంటిదొంగ అని పోలీసులు గుర్తించారు. మద్యం దుకాణాల ఏర్పాటు కోసం.. వ్యాపారులు ఇచ్చిన డిపాజిట్ సొమ్మును స్టేషన్ లో తాత్కాలికంగా భద్రపరిచారు పోలీసులు. ఆ సొమ్మును బ్యాంక్ లో డిపాజిట్ చేద్దామని ఓపెన్ చేసి లెక్కిస్తే… అందులో 16లక్షల రూపాయలు తగ్గినట్టు తెలిసింది.
Read This : Viral Video : బ్యాంకు క్యూలైన్ లో ఉండగా గుండెపోటు.. 5 సెకండ్లలో మృతి
బీరువాలో దాచిన సొమ్ములో కొంత నగదును నూజివీడు స్టేషన్ కానిస్టేబుల్ జనార్ధన్ నాయుడు కాజేసి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుల్ జనార్ధన్ నాయుడు సొంత ఊరు విశాఖపట్నం కావడంతో… పోలీస్ బృందం నూజివీడు నుంచి వైజాగ్ కు బయల్దేరి వెళ్లింది.
Read This : Wife killed Husband : భర్తను చంపి బాత్రూమ్ లో పాతిపెట్టిన భార్య
మద్యం షాపుల వ్యాపారులు డిపాజిట్ చేసిన మొత్తంలో డబ్బు ఎలా తగ్గింది… ఎక్కడికి పోయింది.. అనేదానిపై.. సీసీ కెమెరాలు చూసి గుర్తించారు పోలీసులు. తగ్గిన మొత్తం 16లక్షలు.. కానిస్టేబులే తీసుకెళ్లాడని కన్ ఫామ్ చేసుకున్నారు. డిపాజిటర్లకు భరోసా ఇచ్చారు. స్టేషన్ కానిస్టేబుల్ జనార్ధన్ నాయుడు గత రికార్డ్ ను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.