Maharashtra : ఏక్‌నాథ్ షిండేనే మహారాష్ట్ర సీఎంగా కొనసాగుతారు…బీజేపీ చీఫ్ వెల్లడి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్ కులే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, అయితే ఆయనే రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే చెప్పారు....

Maharashtra : ఏక్‌నాథ్ షిండేనే మహారాష్ట్ర సీఎంగా కొనసాగుతారు…బీజేపీ చీఫ్ వెల్లడి

Shinde Will Continue As CM

Maharashtra : మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్ కులే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, అయితే ఆయనే రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే చెప్పారు. (BJP president Chandrashekhar Bawankule) ఏక్‌నాథ్ షిండే సీఎంగా కొనసాగుతారని ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్‌తో సహా మా సీనియర్ నేతలందరూ చెప్పారు. (Eknath Shinde Will Continue As Chief Minister)

South African : దక్షిణాఫ్రికాలో గ్యాస్ లీక్‌, 16 మంది మృతి

రాష్ట్రానికి ఆయన బాగా పనిచేస్తున్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎన్‌సిపి నేత అజిత్ పవార్ మరో 8 మంది ఎమ్మెల్యేలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారతారని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ అంతకుముందు రోజు చెప్పారు. (Opposition Creating Confusion) దీనిపై మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయ్ స్పందిస్తూ షిండేకి మద్దతుగా నిలిచారు.

Small Plane Crash : ఫ్రాన్సులో చిన్న విమానం కూలి ఇద్దరి మృతి

ఏక్ నాథ్ షిండే నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. సిఎం ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేసే ప్రశ్నే లేదని, తమకు 200 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఏ నాయకుడూ అసంతృప్తిగా లేరని శంభురాజ్ దేశాయ్ చెప్పారు. అంతకుముందు ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమిలో చేరడం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనుంది.