Tiranga Yatra in Kashmir: కశ్మీర్ చరిత్రలో పాక్ జెండాలు: లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
కశ్మీర్ లోయలో మొట్టమొదటి సారి తిరంగ యాత్ర నిర్వహించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన ఈ యాత్రను కొనసాగించారు. ఈ సవాలు గురించి సిన్హాను ప్రశ్నించగా.. ‘‘వారు వీరు అని ఏం లేదు. అన్ని సమూహాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తిరంగ యాత్రలో చేరుతున్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది’’ అని అన్నారు.

Pak flags in kashmir history says lt governor manoj sinha
Tiranga Yatra in Kashmir: కశ్మీర్లో గతంలో పాకిస్తాన్ జెండాలు ఎగిరిన దాఖలాలు ఉన్నాయని, అయితే నేడు త్రివర్ణ పతాకం మాత్రమే రెపరెపలాడుతోందని జమ్మూ కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లోని దాల్ సరస్సు సమీపంలో ‘తిరంగ యాత్ర’ నిర్వహించారు. ఈ యాత్రకు అన్నీ తానై వ్యవహరించారు సిన్హా. యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కశ్మీర్ చరిత్రలో పాక్ జెండాలు ఎగిరిన ఉదంతాలు అనేకం. కానీ నేను త్రివర్ణ పతాకం మాత్రమే ఎగురుతోంది. ఇక్కడి ప్రజల చేత మువ్వన్నెల జెండా ఎగరవేసే ఆలోచనలు ప్రయత్నాలు సరిగా జరగలేదు. కానీ ఇప్పుడు అలా లేదు. తాజా ప్రయత్నాల వల్ల కశ్మీర్‌లోని వీధి వీధి మువ్వన్నెల జెండాతో మురిసిపోతోంది’’ అని అన్నారు.
వేర్పాటువాదం, పాకిస్తాన్ సానుకూలురు అనే వివాదాలు కశ్మీర్‌ను ఎప్పటి నుంచో చుట్టుముట్టుకుని ఉన్నాయి. జాతీయ అంశాలు కశ్మీర్లో చాలా సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం భద్రతా సమస్యకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయలో మొట్టమొదటి సారి తిరంగ యాత్ర నిర్వహించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన ఈ యాత్రను కొనసాగించారు. ఈ సవాలు గురించి సిన్హాను ప్రశ్నించగా.. ‘‘వారు వీరు అని ఏం లేదు. అన్ని సమూహాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తిరంగ యాత్రలో చేరుతున్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది’’ అని అన్నారు.