T20 World Cup: భారత్‌తో పాటు సెమీఫైనల్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు.. బంగ్లాపై ఐదు వికెట్ల తేడాతో విజయం

పాకిస్థాన్ జట్టు సెమీస్‌లో అడుగు పెట్టింది. బంగ్లాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన పాక్.. గ్రూప్ -2 విభాగం నుంచి భారత్‌తో‌పాటు సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. పసికూన నెదర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా జట్టు ఓటమితో పాక్ కు సెమీస్ అవకాశాలకు అడ్డులేకుండా పోయింది.

T20 World Cup: భారత్‌తో పాటు సెమీఫైనల్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు.. బంగ్లాపై ఐదు వికెట్ల తేడాతో విజయం

T20 World Cup

Updated On : November 6, 2022 / 1:39 PM IST

T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సెమీఫైనల్‌లోకి పాకిస్థాన్ జట్టు అడుగు పెట్టింది. ఆదివారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు.. గ్రూప్-2 నుంచి భారత్ జట్టుతో పాటు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. గ్రూప్-2 నుంచి ఆదివారం ఉదయం దక్షిణాఫ్రికా- నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పసికూన నెదర్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. దీంతో బంగ్లాపై గెలిచిన పాక్ జట్టు సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టేందుకు అవకాశం దక్కింది.

T20 World Cup 2022: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ 50వ టీ20 మ్యాచ్

ఆదివారం పాకిస్థాన్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. పాకిస్థాన్ పదునైనా బంతులకు బంగ్లా బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. కేవలం షింటో (54) ఒక్కడు హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. గత మ్యాచ్‌లో భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన లిటన్‌ దాస్‌ 10 పరుగులకే ఔటయ్యాడు. సౌమ్య సర్కార్‌ (20), ఆసిఫ్‌ హుస్సేన్‌ (24) రెండంకెల స్కోర్‌ చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ 127 పరుగులు మాత్రమే చేసింది.

T20 world cup 2022: నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి.. సెమీఫైనల్స్‌కు భారత్

128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ నిలకడగా ఆడి. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్‌ ఆజాం (32), మహమ్మద్‌ రిజ్వాన్‌ (25) రాణించారు. వీళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్‌ హరిష్‌ ( 31 ) మెరిశాడు. షాన్‌ మసూద్‌ (22 ) కూడా రాణించాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌పై గెలుపొంది పాకిస్థాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించింది.