Pawan Kalyan: మళ్ళీ ఒకేసారి రెండు సినిమాలతో పవన్ బిజీ బిజీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో తీసుకున్న విరామం తర్వాత మరింత దూకుడు మీదున్నారు. కరోనా తొలిదశ లాక్ డౌన్ తర్వాత వకీల్ సాబ్ తో భారీ హిట్ దక్కించుకున్న పవన్ తదుపరి సినిమాలను కూడా లైన్లో పెట్టేసాడు

Pawan Kalyan
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో తీసుకున్న విరామం తర్వాత మరింత దూకుడు మీదున్నారు. కరోనా తొలిదశ లాక్ డౌన్ తర్వాత వకీల్ సాబ్ తో భారీ హిట్ దక్కించుకున్న పవన్ తదుపరి సినిమాలను కూడా లైన్లో పెట్టేసాడు. వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టిన పవన్ కరోనాతో కొద్దిరోజులుగా విరామం ఇచ్చారు.
అయితే.. ఇప్పుడు మరోసారి మళ్ళీ ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టాలని చూస్తున్నాడట. ప్రస్తుతం పవన్ అయ్యప్పనుమ్ కోషియంతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరహరవీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నాడు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టి షూటింగ్స్ మొదలైతే ఈ రెండు సినిమాలను ఒకేసారి మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నాడట. అయ్యప్పనుమ్ కోషియం ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తికాగా రెండు సినిమాలను పార్లల్ గా పూర్తిచేయాలని భావిస్తున్నాడట.
కాగా.. అయ్యప్పనుమ్ లో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుందని టాక్ నడుస్తుండగా.. హరహరవీరమల్లులో జోడీగా నిధి అగర్వాల్ నటించనుందని వినిపిస్తుంది. హీరోయిన్ ఎంపికపై దర్శకుడు క్రిష్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోగా పాత్రను దృష్టిలో పెట్టుకొని నిధి పేరును పరిశీలిస్తున్నట్లుగా వినిపిస్తుంది. మరోవైపు అయ్యప్పనుమ్ లో హీరోయిన్ పాత్రపై కూడా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఇవన్నీ క్లారిటీ రావాలంటే సినిమా సెట్స్ మీదకి వెళ్లాల్సిందే.