Pawan Kalyan: ఆ క్రేజీ ప్రాజెక్టుకు పవన్ చెక్ పెట్టేశాడా.. ఇక అది లేనట్టేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోండగా, ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ సినిమాలను ఓకే చేస్తూ దూకుడును ప్రదర్శించారు. గతంలో దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘భవదీయుడు భగత్‌సింగ్’, తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ను కూడా రీమేక్ చేయాలని ప్లాన్ చేశాడు.

Pawan Kalyan: ఆ క్రేజీ ప్రాజెక్టుకు పవన్ చెక్ పెట్టేశాడా.. ఇక అది లేనట్టేనా?

Pawan Kalyan Not Interested Anymore In Bhavadeeyudu Bhagat Singh Movie

Updated On : November 10, 2022 / 1:32 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోండగా, ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ సినిమాలను ఓకే చేస్తూ దూకుడును ప్రదర్శించారు. గతంలో దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘భవదీయుడు భగత్‌సింగ్’, తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ను కూడా రీమేక్ చేయాలని ప్లాన్ చేశాడు.

Pawan Kalyan: మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్..

అయితే, ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుండటం.. త్వరలోనే రాజకీయాల్లో పూర్తిగా బిజీగా మారనుండటంతో పవన్ ఓ క్రేజీ ప్రాజెక్టును పక్కనబెట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్‌తో చేయాలని చూసిన భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను పవన్ ఇక చేయాలని అనుకోవడం లేదట. ఈ సినిమాను ఎంత త్వరగా స్టార్ట్ చేసినా కూడా ఆలస్యం అవుతుందని ఆయన భావిస్తున్నాడట. అందుకే ఆయన ఈ ప్రాజెక్టును పక్కనబెట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Pawan Kalyan: ఆ డైరెక్టర్‌ను పవన్ పక్కనబెట్టాడా?

కాగా, ఈ సినిమాపై హరీష్ శంకర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పవన్ కల్యాణ్‌తో గతంలో గబ్బర్‌సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న హరీష్, ఈసారి అంతకుమించిన సక్సెస్‌ను అందుకోవాలని గట్టిగా ప్లాన్ చేశాడు. మరి నిజంగానే పవన్ కల్యాణ్ ఈ సినిమాను పూర్తిగా పక్కనెబెట్టేశాడా.. లేక ఈ వార్తలు కేవలం పుకార్లేనా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.