chandrababu: చంద్రబాబు పర్యటనలో జేబు దొంగల చేతివాటం.. మాజీ మంత్రి గొల్లపల్లి పర్సును కొట్టేసిన వైనం
సోంపల్లిలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పర్సును కొట్టేశారు. రూ.32,000 నగదు, రూ.17,000 విలువ చేసే విదేశీ కరెన్సు పోయినట్లు రాజోలు పోలీస్ స్టేషన్‌లో గొల్లపల్లి సూర్యారావు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, గొల్లపల్లి సూర్యారావుతో పాటు మరో 30 మంది నాయకుల పర్సులు పోయినట్లు సమాచారం.

Gollapalli
chandrababu: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రెండు-మూడు రోజులుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా కోనసీమ జిల్లా రాజోలులో ఆయన ఇవాళ పర్యటించారు. అయితే, ఆయన పర్యటనలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సోంపల్లిలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పర్సును కొట్టేశారు. రూ.32,000 నగదు, రూ.17,000 విలువ చేసే విదేశీ కరెన్సు పోయినట్లు రాజోలు పోలీస్ స్టేషన్‌లో గొల్లపల్లి సూర్యారావు ఫిర్యాదు చేశారు.
అంతేకాదు, గొల్లపల్లి సూర్యారావుతో పాటు మరో 30 మంది నాయకుల పర్సులు పోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన పర్యటనలో భాగంగా చంద్రబాబు వరద బాధితుల సమస్యలు తెలుసుకుంటున్నారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వరద నష్టంపై పరిశీలన చేస్తున్నారు. అలాగే, ఏపీ సీఎం జగన్ సర్కారు తీరును ఎండగడుతున్నారు.