PM Modi: దమ్ముంటే ఆపు అనే నినాదంతో బతకాలి – ప్రధాని మోదీ
లంబసింగ్‌లో ఆదివాసీల చరిత్రను ప్రతిబింబించేలా అల్లూరి మెమోరియల్ నెలకొల్పుతాం. మన సంపదను ఆంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లేదానిపై కసరత్తు చేస్తున్నాం. అడవి ప్రాంతంలో పెరిగే సంపదపై సంపూర్ణంగా ఆదివాసులకు హక్కులు కల్పిస్తున్నాం.

Pm Modi (5)
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి విచ్చేశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. భీమవరంలో క్షత్రియ సేవాసమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన కార్యక్రమంలో ఆదివాసీల అభివద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
“లంబసింగ్‌లో ఆదివాసీల చరిత్రను ప్రతిబింబించేలా అల్లూరి మెమోరియల్ నెలకొల్పుతాం. మన సంపదను ఆంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లేదానిపై కసరత్తు చేస్తున్నాం. అడవి ప్రాంతంలో పెరిగే సంపదపై సంపూర్ణంగా ఆదివాసులకు హక్కులు కల్పిస్తున్నాం”
“గతంలో పన్నెంటిపైనే అడవి సంపదకు మద్ధతు ధర ఉండేది. దానిని ప్రస్తుతం 90 రకాల అడవి సంపద ఉత్పత్తులకు వర్తించేలా కనీసమద్ధతు ధర కల్పించాం. సమయానుకులంగా అడవి ప్రాంతంలో నివసించే వారంతా మారాలనే ఉద్దేశ్యంతో ఆధునిక స్కిల్ నేర్పించాలని 50 గ్రూప్స్, 3 వేల ప్రాడెక్ట్‌లను డెవలప్ చేస్తున్నాం”
“విశాఖ ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేశాం. వెనుకబడిన ఆదివాసీ జిల్లాలకు లాభం చేకూరుతుందని విశ్వసిస్తున్నా. ఆదివాసీలకు మంచి విద్యనందించాలనే ఉద్దేశ్యంతో 750 ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తాం. ఆదివాసీ ప్రాంతాల బిడ్డలకు మంచి విద్యనందిస్తే అంతామంచి జరుగుతుంది”
“మన్యం వీరుడు ధైర్యంగా ఆంగ్లేయులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. మారుతున్న కాలానుగుణంగా మనం కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. అల్లూరిని ఆదర్శంగా తీసుకొని మనందరం ఐక్యం కావాలి. దమ్ముంటే ఆపు అనే నినాదంతో ముందుకు సాగాలి. తెలుగు గడ్డపై ప్రాణాలు అర్పించిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మనదేశాన్ని అభివృద్ధి పథంలో వెళ్లకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు”