Drunk principal : పుల్లుగా మందుకొట్టొచ్చి స్కూల్లోనే నిద్రపోయిన ప్రిన్సిపాల్

స్కూల్లో పిల్లలకు మంచి చెడులు చెప్పాల్సిన ప్రిన్సిపల్ తప్పతాగొచ్చి షర్టు లేకుండా స్కూల్ క్లాస్ రూమ్ లోనిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పిల్లలకు మంచి చెడులు చెప్పటమేకాదు..స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్పేలా చూడాల్సిన ప్రిన్సిపాలే తప్పతాగి వచ్చి స్కూల్లో నిద్రపోవటం విమర్శలకు దారి తీసింది.

Drunk principal : పుల్లుగా మందుకొట్టొచ్చి స్కూల్లోనే నిద్రపోయిన ప్రిన్సిపాల్

Principal sleeping in classroom after allegedly getting drunk in Maharashtra

Updated On : November 24, 2022 / 12:50 PM IST

Drunk principal : స్కూల్లో పిల్లలకు మంచి చెడులు చెప్పాల్సిన ప్రిన్సిపల్ తప్పతాగొచ్చి షర్టు లేకుండా స్కూల్ క్లాస్ రూమ్ లోనిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పిల్లలకు మంచి చెడులు చెప్పటమేకాదు..స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్పేలా చూడాల్సిన ప్రిన్సిపాలే తప్పతాగి వచ్చి స్కూల్లో నిద్రపోవటం విమర్శలకు దారి తీసింది.

మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన స్కూల్ హెడ్మాస్టారు క్లాస్ రూమ్ లోనే నిద్రపోయాడు. పుల్ గా మద్యం తాగి స్కూల్లోనే నిద్రపోవడం..పైగా కనీసం ఒంటి మీద చొక్కా కూడా లేకుండా… స్కూల్లోని గదిలోనే నిద్రపోవటంపై జనాలు మండిపడుతున్నారు. ఇటువంటివారిని చూసి పిల్లలు కూడా అలాగే తయారవుతారనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి స్కూల్ విద్యార్ధులే వీడియో తీయటంతో ఇది వెలుగులోకి వచ్చింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ప్రిన్సిపల్ పై విమర్శలు వస్తున్నాయి. ఆ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.