లండన్‌లో కో-స్టార్‌తో ప్రియాంకా చోప్రా హాట్ కిస్.. వైరల్

Priyanka Chopra Steamy Kiss in London : హాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా రొమాన్స్ కిస్సింగ్ సీన్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లండన్ స్ట్రీట్‌లో జరిగిన కొత్త మూవీ షూటింగ్ రొమాంటిక్ సీన్లకు సంబంధించి ఫొటోలను షేర్ చేసింది.
38ఏళ్ల ప్రియాంకా చోప్రా.. ఇటీవలే నిక్ జోనాస్‌తో తన రెండేళ్ల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. రాబోయే మూవీ కోసం నిక్ తో లండన్ వెళ్లిన ప్రియాంకా అక్కడి షూటింగ్‌లో బిజీ అయిపోయింది. రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ Text For Youలో సహ నటుడు సామ్ హ్యూఘన్‌తో లిప్ లాక్ సీన్‌లో ప్రియాంకా నటించింది.
ఈ మూవీ షూటింగ్‌లో రొమాంటిక్ సీన్ ఫుటేజ్‌లను ఆమె షేర్ చేసింది. 38 ఏళ్ల ప్రియాంక చోప్రా ఔట్‌ల్యాండర్ స్టార్, సామ్ హ్యూఘన్(40)తో లిప్ లాక్ చేసింది.
మంచు కురుస్తున్న ఈ సీన్‌లో ప్రియాంకా అతడి భుజంపై చేయి వేయగా.. సామ్ ఆమెను దగ్గరగా పట్టుకున్నాడు. ఆరెంజ్ కలర్ కోటులో ప్రియాంకా బ్రైట్ పింక్ దుస్తులతో మెరిసిపోతోంది. లండన్ వీధిలో ఒకరినొకరు ఎదురుపడే సీన్ అది. మంచు కురుస్తున్న సమయంలో ఈ జంట కలుసుకుంటుంది.
ఒకరిపై మరొకరు ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసుకుంటూ లిప్ లాక్ చేసే సీన్.. ఈ మూవీలో ప్రియాంక ప్రధాన పాత్ర పోషిస్తుంది. హైలాండర్ స్టార్ సామ్ హ్యూగన్ జోడీగా నటిస్తుండగా.. ఇతర సహనటులు సెలిన్ డియోన్, రస్సెల్ టోవే ఓమిడ్ జాలిలి ఉన్నారు.
ఈ మూవీకి సెలిన్ సంగీతం అందిస్తున్నారు. Text for me అనే జర్మన్ మూవీ SMS Fur Dichకి ఇది ఇంగ్లీష్ రీమేక్.. Sofie Cramer పేరుతో నవల ఆధారంగా రూపొందించారు.