smriti irani: రాహుల్ గాంధీ హాజరు 40 శాతం మాత్రమే: స్మృతి ఇరానీ చురకలు
''పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగవద్దని ఓ పెద్ద మనిషి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటులో ఆయనకు ఓ చరిత్ర ఉంది. అమేఠీ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అమేఠీని వదిలేసి వయానాడ్‌కు వెళ్ళారు. 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆయన హాజరు 40 శాతం మాత్రమే'' అని ఆమె విమర్శలు గుప్పించారు.

Smriti Rahul
smriti irani: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి చురకలు అంటించారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు ప్రతిపక్ష పార్టీల ఆందోళనల వల్ల పదే పదే వాయిదా పడుతున్న నేపథ్యంలో స్మృతి ఇరానీ స్పందించారు. ”పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగవద్దని ఓ పెద్ద మనిషి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటులో ఆయనకు ఓ చరిత్ర ఉంది. అమేఠీ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అమేఠీని వదిలేసి వయానాడ్‌కు వెళ్ళారు. 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆయన హాజరు 40 శాతం మాత్రమే” అని ఆమె విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీ తీరు పార్లమెంట్‌ను అగౌరవపర్చే రీతిలో ఉందని ఆమె అన్నారు. దేశ ప్రజల సమస్యలపై చర్చించి, వాటికి పరిష్కారం చూపే విధంగా పార్లమెంటులో చర్చలు జరగాలని ప్రజలు కోరుకుంటారని ఆమె అన్నారు. అటువంటి పార్లమెంటులో చర్చలు సజావుగా జరగకుండా రాహుల్ గాంధీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆమె అన్నారు. కాగా, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో లేవనెత్తుతున్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష నేతలతో కలిసి నిరసన తెలిపారు.