telangana: పలు జిల్లాలకు మరో రెండు రోజుల పాటు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్
తెలంగాణలోని పలు జిల్లాలకు మరో రెండు రోజుల పాటు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. 10 టీవీతో ఇవాళ ఆమె మాట్లాడుతూ.. రెడ్ అలర్ట్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆమె చెప్పారు.

Rain
telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు మరో రెండు రోజుల పాటు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. 10 టీవీతో ఇవాళ ఆమె మాట్లాడుతూ.. రెడ్ అలర్ట్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆమె చెప్పారు. నిన్నటి వరకు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేడు బలహీన పడి అల్పపీడనంగా మారిందని వివరించారు. అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై రానున్న రోజుల్లో తక్కువగా ఉంటుందని చెప్పారు.
Maharashtra: పెట్రోల్‌పై లీటరుకు రూ.5 వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర కొత్త సీఎం షిండే
రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కురుస్తాయని అన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అరెంజ్ అలర్ట్ కొనసాగుతోందని చెప్పారు. దక్షిణ తెలంగాణలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని అన్నారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదయిందని చెప్పారు. జోగులంబ గద్వాల్‌లో మాత్రమే అత్యల్ప వర్షపాతం నమోదయిందని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.