చల్లబడ్డ హైదరాబాద్.. పలుచోట్ల వర్షం

చల్లబడ్డ హైదరాబాద్.. పలుచోట్ల వర్షం

Rain In Hyderabad Today

Updated On : April 12, 2021 / 3:46 PM IST

ఎండలతో ఏప్రిల్‌లోనే ఆపసోపాలు పడుతోన్న హైదరాబాద్ నగర ప్రజలకు చిన్న ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, అమీర్‌పేట్‌, యూసుఫ్‌గూడ, జూబ్లిహిల్స్, బంజారా‌హిల్స్ ఫిలింనగర్ ప్రాంతాల్లో వర్షం పడింది.

పగలంతా తీవ్ర ఉక్కపోతతో బాధపడిన నగరవాసులకు ఆహ్లాదంగా అనిపించింది. ఉపరితల ఆవర్తనంతో అకాల వర్షాలు పడుతుండగా.. హైదరాబాద్‌లో చిరుజల్లులు కురిసినట్లుగా చెబుతోంది వాతావరణశాఖ.

నగరంలోని మల్లాపూర్, నాచారం, ఈసీఐఎల్‌, కాప్రా, మల్కాజిగిరి, సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్, సికింద్రాబాద్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి తదితర‌ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వాతావరణం మాత్రం చల్లగా అనిపిస్తుంది.