Unstoppable episode 4 : సురేష్ రెడ్డిని స్పీకర్‌గా ఎంపిక చేసినప్పుడు వైఎస్సార్ నాకొక మాట చెప్పి, సురేష్‌కి ఇంకొక మాట చెప్పాడు.. కిరణ్ కుమార్ రెడ్డి!

సురేష్ రెడ్డి స్పీకర్ గా ఎంపిక చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి నాకొక మాట చెప్పి, సురేష్ కి ఇంకొక మాట చెప్పాడు అంటూ కిరణ్ కుమార్ రెడ్డి అన్‌స్టాపబుల్ టాక్ షోలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Unstoppable episode 4 : సురేష్ రెడ్డిని స్పీకర్‌గా ఎంపిక చేసినప్పుడు వైఎస్సార్ నాకొక మాట చెప్పి, సురేష్‌కి ఇంకొక మాట చెప్పాడు.. కిరణ్ కుమార్ రెడ్డి!

Rajasekhara Reddy said one thing to kiran kumar reddy and another to Suresh reddy

Updated On : November 25, 2022 / 1:00 PM IST

Unstoppable episode 4 : నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ లో బాలయ్య తన పాత స్నేహితులతో కలిసి సందడి చేశాడు.

Unstoppable episode 4 : అజహరుద్దీన్ ఇండియా టీమ్‌కి సెలెక్ట్ అయ్యాక మా ఇంటికి సైకిల్ మీద వచ్చి.. కిరణ్ కుమార్ రెడ్డి!

ఈ ఎపిసోడ్ కి అతిథిలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. కాగా సురేష్ రెడ్డి స్పీకర్ గా ఎంపిక చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి నాకొక మాట చెప్పి, సురేష్ కి ఇంకొక మాట చెప్పాడు అంటూ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. సురేష్ ని స్పీకర్ చేయాలంటే నువ్వు చీఫ్ విప్‌గా ఉంటేనే చేస్తా అంటూ వైస్ నాతో అన్నాడు.

కానీ సురేష్ తో ఏమో.. ‘నువ్వు స్పీకర్ అయిపోయావు, కిరణ్ ని చీఫ్ విప్‌గా ఒప్పించు’ అని చెప్పాడట. ఇద్దరం మిత్రులు అవ్వడంతో అయన అలా మాట్లాడారన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఈ ఎపిసోడ్ మొదలయ్యే ముందు సురేష్ నాకు ఈ విషయం చెప్పాడు అంటూ కిరణ్ వెల్లడించాడు. అయితే సురేష్ రెడ్డి స్పీకర్ గా సెలెక్ట్ అయ్యినట్లు మొదట చెప్పింది కెసిఆర్ అంటూ సురేష్ వ్యాఖ్యానించాడు.