Ram charan : ‘ఆచార్య’ తో ‘సిద్ధ’.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మరోసారి మెగాభిమానులకు, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’..

Ram charan : ‘ఆచార్య’ తో ‘సిద్ధ’.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..

Ram Charan

Updated On : March 27, 2021 / 3:31 PM IST

Ram charan : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మరోసారి మెగాభిమానులకు, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’..

Acharya

ఇటీవల రిలీజ్ చేసిన మెగాస్టార్ లుక్ అండ్ టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘ఆచార్య’ లో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ‘మగధీర’, ‘బ్రూస్ లీ’, ‘ఖైదీ’ సినిమాల తర్వాత చిరు, చరణ్ మరోసారి కలిసి తెరపంచుకోబోతున్నారు.

Acharya

నేడు (మార్చి 27) చెర్రీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఆచార్య’ లో లుక్ రిలీజ్ చేశారు. మెగాస్టార్, మెగా పవర్‌స్టార్ రామ్ ఇద్దరూ కలిసి అలా నడిచివస్తున్న పోస్టర్ చూసి మెగాఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చిరు పక్కన కాజల్ అగర్వాల్, చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ‘ఆచార్య’ మే 13న భారీగా విడుదల కానుంది.

Acharya