Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో రామ్ చరణ్..
చెర్రీ హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ స్పాట్‌లో ఈరోజు అడుగుపెట్టారు..

Ram Charan Rrr
Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’.. ఇప్పటివరకు విడుదల చేసిన రామ్, భీమ్ వీడియోలు రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి..
RRR Movie : డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్.. 10 భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న ‘ఆర్ఆర్ఆర్’..!
క్లైమాక్స్ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుండగా.. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపులతో ‘ఆర్ఆర్ఆర్’ షూట్ పున:ప్రారంభమైంది. చెర్రీ హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ స్పాట్‌లో ఈరోజు అడుగుపెట్టారు.
రామ్ చరణ్ లుక్ కోసం పాపులర్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ కూడ్ షూటింగులో జాయిన్ అయ్యారు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్ కనిపించనున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ ఆడియెన్స్ ముందుకు రానుంది.
Komaram Bheem NTR : గోండు బెబ్బులి గాండ్రింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ న్యూ పోస్టర్..