iOS 13 రన్ అయ్యే అన్ని ఐఫోన్లలో iOS 14 కొత్త అప్‌డేట్ 

  • Published By: srihari ,Published On : June 2, 2020 / 10:21 AM IST
iOS 13 రన్ అయ్యే అన్ని ఐఫోన్లలో iOS 14 కొత్త అప్‌డేట్ 

Updated On : June 2, 2020 / 10:21 AM IST

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి మరో కొత్త OS అప్‌డేట్ రాబోతోంది. ఈ నెలలో WWDC ఈవెంట్ తర్వాత ఆపిల్ నుంచి iOS 14 అప్ డేట్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి ఆపిల్ న్యూస్ వెబ్ సైట్‌లో The Verifier పేర్కొంది. ప్రస్తుత iOS 13 రన్ అయ్యే అన్ని ఐఫోన్, ఐప్యాడ్ టచ్ డివైజ్‌ల్లో ఈ కొత్త iOS 14 అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. రిపోర్టు ప్రకారం… ఈ ఏడాదిలో బిగ్ ఐఓఎస్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ లేకుండా ఎలాంటి డివైజ్‌లను ఆపిల్ వదిలేయడం లేదు. iOS 13 రన్ అయ్యే అన్ని ఐఫోన్లలో అప్ డేట్ తీసుకురానుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఐఫోన్ సాఫ్ట్ యూనివర్సల్ డివైజ్ కంప్యాటిబిలిటీని కూడా నివేదించింది. కానీ, గత ఏడాదిలోనూ ఆపిల్‌కు ఇలాంటి రుమార్లే వచ్చాయి. 

ఐఫోన్ 5s, ఐఫోన్ 6 మోడళ్లలో గత iOS 12 అప్ డేట్ రావడం లేదని రిపోర్టు తెలిపింది. ఆపిల్ ఫుల్ డివైజ్ కంప్యాటిబిలిటీ విషయంలో నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్ మరో ఏడాది కూడా సపోర్ట్ కొనసాగించనుందని అర్థం. 2015లో ఈ రెండు మోడళ్లు రిలీజ్ అయ్యాయి. ఇక 6s సిరీస్, ఒరిజినల్ ఐఫోన్ SE (ఒకే రకమైన A9 చిప్) రెండు ఫోన్లలో iOS 14 అప్ డేట్ అందుబాటులోకి రానుంది. WWDC ప్రకటనలో భాగంగా ఆపిల్ కంపెనీ iOS 14 అప్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో WWDC జూన్ 22 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. 

కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఆన్ లైన్ ఓన్లీ ఈవెంట్ నిర్వహించనుంది. ఐఓఎస్ 14 అప్ డేట్ తర్వాత ఎలాంటి కొత్త ఫీచర్లు యాడ్ కానున్నాయో కచ్చితంగా తెలియదు. కొత్త అప్ డేట్‌తో పాటు ఆపిల్ macOS (macOS 10.16), Apple TV (tvOS 14), ఆపిల్ వాచ్ (watchOS 7) కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆవిష్కరించనుంది. స్థానిక Spotify స్ట్రీమింగ్ కు సపోర్ట్ చేసే Homepad ఫీచర్లలో మరో ప్రధాన సాఫ్ట్ వేర్ అప్ డేట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. 

Read: ఐఫోన్ యూజర్లు ఈ కొత్త అప్‌డేట్ ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?