Booster Dose: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. బూస్టర్ డోసుల కోసం జనాల క్యూ
గత పదిహేను రోజుల్లోనే (జూన్1-15వరకు) దేశవ్యాప్తంగా 47.5 లక్షల మంది వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. అంతకుముందు పదిహేను రోజుల్లో 41.5 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకుంటే, తాజాగా ఆరు లక్షల మంది ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకున్నారు.

Booster Dose
Booster Dose: దేశంలో వరుసగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇటీవలి కాలంలో బూస్టర్ డోసు తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. గత పదిహేను రోజుల్లోనే (జూన్1-15వరకు) దేశవ్యాప్తంగా 47.5 లక్షల మంది వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. అంతకుముందు పదిహేను రోజుల్లో 41.5 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకుంటే, తాజాగా ఆరు లక్షల మంది ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
Agnipath scheme : అగ్నిపథ్ పథకంలో కీలక మార్పు.. వయో పరిమితిని పెంచిన కేంద్రం
కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం, బూస్టర్ డోసు తీసుకుంటే కోవిడ్ ప్రభావం తక్కువగా ఉంటుందని జనం నమ్మడమే దీనికి కారణం. తాజా నివేదిక ప్రకారం మెట్రో నగరాల్లో బూస్టర్ డోసులు ఎక్కువగా తీసుకుంటున్నారు. గత వారం 77.9 శాతం బూస్టర్ డోసులు మెట్రో నగరాల్లోనే తీసుకున్నారు. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో ప్రజలు బూస్టర్ డోసులపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం అరవై ఏళ్లకు తక్కువ వయసున్న వాళ్లు కూడా బూస్టర్ డోసులు తీసుకుంటున్నారు.
Agnipath: తెలంగాణను తాకిన అగ్నిపథ్ సెగ.. సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు
ప్రస్తుతం ప్రైవేటు వైద్య సంస్థలు మాత్రమే అందరికీ బూస్టర్ డోసు అందిస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బూస్టర్ డోసు అరవై ఏళ్ల పైబడిన వాళ్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు మాత్రమే అందుతోంది. అంతకంటే తక్కువ వయసున్న వాళ్లు ప్రైవేటు కేంద్రాల్లోనే బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి.