Madhya Pradesh : కదులుతున్న రైలు కిందపడబోయిన మహిళను కాపాడిన RPF కానిస్టేబుల్

కొంతమంది అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కదులుతున్న రైలు ఎక్కబోయింది ఓ మహిళ. వెంటనే అప్రమత్తమైన RPF కానిస్టేబుల్ వెంటనే ఆమె ప్రాణాలు కాపాడారు. లేదంటే ఆమెకు పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ విషయాన్ని RPF ట్విట్టర్ లో షేర్ చేయడమే కాకుండా ప్రయాణికులకు మరోసారి జాగ్రత్తలు సూచించింది.

Madhya Pradesh : కదులుతున్న రైలు కిందపడబోయిన మహిళను కాపాడిన RPF కానిస్టేబుల్

Madhya Pradesh

Updated On : May 27, 2023 / 1:13 PM IST

RPF constable who saved the woman : కదులుతున్న ట్రైన్ ఎక్కవద్దని రైల్వే అధికారులు ఎన్ని జాగ్రత్తలు సూచించినా ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. కదులుతున్న రైలు కింద పడకుండా ఓ మహిళను RPF కానిస్టేబుల్ చాకచక్యంగా కాపాడి అందరి ప్రశంసలు పొందారు.

Bihar : ఏకంగా రైల్వే ట్రాక్‌నే చోరీ చేసిన దొంగలు.. సహకరించిన RPF సిబ్బంది

RPF పలు సందర్భాల్లో ప్రయాణికులకు సహాయం చేయడంలో అప్రమత్తంగా ఉంటుంది. రీసెంట్ గా మధ్యప్రదేశ్ లోని గంజ్‌బా‌సోడా రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు కింద పడిపోతున్న మహిళ ప్రాణాలను కాపాడారు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ధీరేంద్ర సింగ్. RPF INDIA ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంది. ‘గంజబ్‌సోడా రైల్వే స్టేషన్ లో నియమించబడిన కానిస్టేబుల్ ధీరేంద్ర సింగ్, కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నిస్తూ కింద పడబోయిన ప్రయాణికురాలిని కాపాడారు. దయచేసి కదులుతున్న రైలులో ఎక్కడానికి, దిగడానికి ప్రయత్నం చేయవద్దు. మీ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు’ అనే శీర్షికతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.

Viral Letter : నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని కోరిన కానిస్టేబుల్.. ఐదు రోజులు సెలవిచ్చిన అధికారి

ఈ వీడియోపై పలువురు స్పందించారు. ‘RPF సిబ్బంది చేసిన పనికి ధన్యవాదాలు’ అని .. ‘మీ సహాయం చూసి గర్వపడుతున్నాను’ అని వరుసగా కామెంట్లు పెడుతున్నారు. ఒక ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్ ఎక్కవచ్చు. కానీ గమ్యానికి చేరాలనే తొందరలో చాలామంది కదులుతున్న ట్రైన్ ఎక్కడానికి, దిగడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టుకుంటారు. లేదా కాళ్లు, చేతులు పోగొట్టుకుని జీవచ్చవంలా మారతారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని RPF సూచిస్తోంది. ఇలాంటి సంఘటనలు చూసైనా ప్రయాణికులు ఇలాంటి పనులు చేయడం మానస్తే వారికే మంచిది.