తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు, పాత చార్జీలే వసూలు
ఎట్టకేలకు రథ చక్రాలు కదిలాయి. రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2

ఎట్టకేలకు రథ చక్రాలు కదిలాయి. రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2
ఎట్టకేలకు రథ చక్రాలు కదిలాయి. రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. మంగళవారం(మే 19, 2020) హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. లాక్‌డౌన్ 4వ దశలో నిబంధనల సడలింపుతో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సీఎం కేసీఆర్ మార్చి 22న లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతించడంతో 57 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి.
రాష్ట్రవ్యాప్తంగా 6 వేల బస్సులు నడిపిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. కాగా, ఆర్టీసీ చార్జీలు పెంచుతారనే ఊహాగానాలు వినిపించినా… పాత చార్జీలనే ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు.
ఉదయం 6 గంటల నుంచి బస్సుల ట్రిప్పులు ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటల లోపు డిపోకి చేరుకోవాలి. రాత్రి 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్న సంగతి తెలిసిందే. గంట అటు ఇటు అయితే ఓకే.. కానీ అంతకన్నా ఎక్కువ సమయం అయితే మాత్రం అనుమతించబోమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. అలాగే ఎంజీబీఎస్ వరకు బస్సులను అనుమతించరు. ఆ ప్రాంతం కంటోన్మెంట్ జోన్లలో ఉండటంతో పర్మిషన్ ఇవ్వడం లేదు.
* సూర్యాపేట డిపో నుంచి రోడ్డెక్కిన 78 బస్సులు
* 54 సీటింగ్ కెపాసిటీతో ప్రయాణం
* శ్రీశైలం మినహా అన్ని రూట్లలో బస్సులు నడపాలని డిపో అధికారుల నిర్ణయం
* నల్లగొండ రీజియన్‌లో 400 బస్సులు రోడ్డెక్కాయి
* నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం నుంచి వచ్చే బస్సులు హయత్‌నగర్ వరకు రానున్నాయి
* ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 9 డిపోల నుంచి 761 బస్సులు రోడ్డెక్కాయి
* మహబూబ్ నగర్ డిపో బస్సులు ఆరాంఘర్ కు, సంగారెడ్డి నుంచి వచ్చేవి బీహెచ్ఈఎల్ వరకు మాత్రమే
* కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోల బస్సులు పహాడీషరీఫ్ వరకు వస్తాయి.
* కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బస్సులు.. జేబీఎస్ వరకే
* ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఆటోలు, ట్యాక్సీలలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది
* హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేదు
* అంతర్రాష్ట్ర బస్సులు నడపడానికి అనుమతి లేకపోవడంతో ఆ సర్వీసులను ఇతర రూట్లలో తిప్పాలని అధికారుల నిర్ణయం
* అంతర్రాష్ట్ర రూట్లలో రద్దీని బట్టి రాష్ట్ర సరిహద్దు చివరి బస్టాండ్ వరకు బస్సులు నడపనున్నారు
కరోనా కట్టడికి కొత్త నిబంధనలు:
* కరోనా వైరస్ దృష్ట్యా అన్ని డిపోల్లోని బస్సులను శానిటైజ్
* బస్సు ప్రతీ ట్రిప్పు తర్వాత డిపోకి వెళుతుంది. అక్కడ శానిటైజ్ చేశాకే.. మరో ట్రిప్పు వెళ్లనుంది.
* బస్సు ఎక్కేముందు ప్రయాణికులకు థర్మల్ స్కీనింగ్
* మాస్క్ ఉంటేనే బస్సులోకి అనుమతి
* డ్రైవర్, కండక్టర్ కూడా విధిగా మాస్క్ ధరించాలి
* బస్సు స్టార్ట్ కావడానికి ముందే కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోవాలి