‘సాహో’ అక్కడ బ్లాక్‌బస్టర్.. 250 రోజులు పూర్తి చేసుకుంది..

  • Published By: sekhar ,Published On : December 11, 2020 / 03:57 PM IST
‘సాహో’ అక్కడ బ్లాక్‌బస్టర్.. 250 రోజులు పూర్తి చేసుకుంది..

Updated On : December 11, 2020 / 5:21 PM IST

Saaho Completed 250 Days: రెబల్‌స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా.. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘సాహో’.. ‘బాహుబలి’ సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో.. భారీ అంచనాల మధ్య 2019 ఆగస్టు 30న విడుదలైంది.



ఇక్కడ అంచనాలను అందుకోలేక పోయింది. ఫ్యాన్స్‌కి సూపర్ అనిపిస్తే, ప్రేక్షకులు మాత్రం యావరేజ్ అనేశారు. కట్ చేస్తే ఇప్పుడు ‘సాహో’ విజయవంతంగా 250 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా జపాన్‌లో కావడం విశేషం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి విదేశాల్లోనూ అభిమానులున్నారు.

SAAHO

జాపాన్‌లో అయితే డార్లింగ్‌కి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్‌తో ఇండియాలో కంటే కాస్త ఆలస్యంగా విడుదలైన ‘సాహో’ అక్కడి ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఇటీవలే 250 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. త్వరలో 300 రోజులు ఆపై 365 డేస్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.