Vikram Movie : నాగర్జున ‘విక్రమ్’ లానే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి – శేఖర్ మాస్టర్..

నాగవర్మ బైర్రాజును హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో.. ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘విక్రమ్’..

Vikram Movie : నాగర్జున ‘విక్రమ్’ లానే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి – శేఖర్ మాస్టర్..

Vikram Movie

Updated On : June 5, 2021 / 12:50 PM IST

Vikram Movie: నాగవర్మ బైర్రాజును హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో.. ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘విక్రమ్’. దివ్యా సురేష్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శనివారం హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ‘పడిపోయా పడిపోయా’ అనే పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేశారు.

Sekhar Master

అనంతరం ముఖ్య అతిథి శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు ప్రముఖ హీరో నాగార్జున గారు ‘విక్రమ్’ అనే పేరు గల చిత్రంతో పరిచయమయ్యారు. అదే టైటిల్‌తో వస్తున్న హీరో నాగవర్మకు కూడా ఈ తొలి చిత్రం మంచి విజయాన్ని అందించి.. అతను హీరోగా నిలబడాలని కోరుకుంటున్నా. ‘పడిపోయా పడిపోయా’ అనే ఈ పాట ప్రేమికులకు ఎంతో స్ఫూర్తిని కలిగించేలా ఆకట్టుకుంటోంది. నాగవర్మ చక్కటి అభినయంతో పాటలలో అలరింపజేస్తూ, ఫైట్స్‌లోనూ కుమ్మేశాడు’’ అన్నారు.

Vikram Movie

చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు మాట్లాడుతూ.. ‘‘శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతం. ఈ పాట ఆయన చేతుల మీదుగా విడుదల చేయడం కరెక్ట్ అనిపించింది. మా సినిమా పాటలు, టీజర్, పోస్టర్స్ పలువురు సినీ ప్రముఖుల ద్వారా విడుదల అవుతుండడం ఎనలేని ఆనందంగా ఉంది. టీం సమష్టి కృషితో చిత్రం చాలా బాగా వచ్చింది’’ అని తెలిపారు.

దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ.. ‘‘మ్యూజికల్ ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మిళితం చేసి నవ్యరీతిలో ఈ చిత్రాన్ని మలిచాం. ‘విక్రమ్’ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే కొన్ని పాత్రల స్వరూప స్వభావాలను ఇందులో చూపించాం. ఇంకా చెప్పాలంటే సొసైటీలోని పాత్రలకు దగ్గరగా ఈ క్యారెక్టర్లు ఉంటాయి. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం’’ అన్నారు.

Vikram Movie

సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఇందులోని ఐదు పాటలతో పాటు, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది’’.. అని చెప్పగా… కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్.. ‘‘ఇందులో నాలుగు పాటలకు తాను కొరియోగ్రఫీ చేశానని’’ చెప్పారు..