ఉత్తరప్రదేశ్ లో దారుణం : మద్యం మత్తులో మేనల్లుడిపై కాల్పులు

ఉత్తరప్రదేశ్ లో దారుణం : మద్యం మత్తులో మేనల్లుడిపై కాల్పులు

Updated On : February 27, 2021 / 3:40 PM IST

Shooting on nephew under the influence of alcohol : ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన మేనల్లుడినే కాల్చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఇంటి ఆవరణలో కూర్చోని మందు తాగుతున్నారు. ఆ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు. మందు తాగుతున్న వాళ్లలో ఓ వ్యక్తి అక్కడే ఉన్న పిస్టోల్ తీసుకున్నాడు.

ఎదురుగా ఉన్న వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూనే.. ఒక్కసారిగా గన్‌ను లోడ్‌ చేశాడు. వీడియో తీస్తున్న తన మేనల్లుడి పైకి ఎక్కు పెట్టి షూట్ చేశాడు. కావాలని కాల్పులు జరిపాడో.. లేక మద్యం మత్తులో షూట్ చేశాడో తెలియదు గానీ… ఓ ప్రాణాన్ని బలితీసుకున్నాడు.