Movie Shootings : టాలీవుడ్‌లో షూటింగ్స్ సందడి..
మనవాళ్లు ఇప్పటికే షెడ్యూల్స్ వేసుకుని షూటింగ్స్‌కి దిగుతుంటే.. మిగతా రాష్ట్రాల్లో ఇంకా షూటింగ్స్ పర్మిషన్స్‌కి నో ఛాన్స్ అంటున్నారు.. అందుకే ఛలో హైదరాబాద్ అంటూ స్టార్లందరూ ఇక్కడే వాలిపోతున్నారు..

Shooting Resume After Corona Second Wave
Movie Shootings: సెకండ్ వేవ్ స్పీడ్ తగ్గింది. అందుకే ఆగిపోయిన షూటింగుల్ని మళ్లీ మొదలు పెడుతోంది టాలీవుడ్. మనవాళ్లు ఇప్పటికే షెడ్యూల్స్ వేసుకుని షూటింగ్స్‌కి దిగుతుంటే.. మిగతా రాష్ట్రాల్లో ఇంకా షూటింగ్స్ పర్మిషన్స్‌కి నో ఛాన్స్ అంటున్నారు. అందుకే ఛలో హైదరాబాద్ అంటూ స్టార్లందరూ ఇక్కడే వాలిపోతున్నారు.
టాలీవుడ్‌లో షూటింగ్ సందడి స్టార్ట్ అయ్యింది. వన్ బై వన్ సెట్లోకి అడుగుపెడుతున్నారు స్టార్లు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ఇంకా షూటింగ్స్‌కి పర్మిషన్ ఇవ్వకపోవడంతో అందరూ హైదరాబాద్‌లోనే షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ విశాల్ తన 31 వ సినిమా ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్‌ని హైదరాబాద్ షిఫ్ట్ చేసేశారు. శరవణన్ డైరెక్షన్‌లో 40,50 రోజుల లాంగ్ షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేసేయ్యాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు విశాల్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించి విశాల్ యాక్షన్ వీడియో మేకింగ్‌ని కూడా రిలీజ్ చేసింది టీమ్.
విశాల్‌తో పాటు కార్తి, సూర్య కూడా తమ సినిమాల షూటింగ్‌ని హైదరాబాద్ షిఫ్ట్‌కు చేస్తున్నారు. సూర్య తన 40 వ సినిమాని పాండిరాజ్ డైరెక్షన్‌లో చేస్తున్నారు. పాండిరాజ్ డైరెక్షన్‌లో కార్తి చేసిన ‘చినబాబు’ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సూర్య.. ఆ డైరెక్టర్‌తోనే తన 40వ సినిమాని ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి షూటింగ్ కోసం హైదరాబాద్‌నే సెలెక్ట్ చేసుకున్నారు సూర్య. సూర్య తమ్ముడు కార్తి కూడా తన అప్‌కమింగ్ సినిమా షూటింగ్‌ని హైదరాబాద్‌లోనే ప్లాన్ చేసుకున్నారు. పి.ఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘సర్దార్’ సినిమా షూటింగ్ హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ చేసుకున్నారు.
లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఛలో హైదరాబాద్ అంటున్నారు. ‘భారతీయుడు 2’ మిడిల్ డ్రాప్ అయినా.. లాక్‌డౌన్ తర్వాత ఫస్ట్ షూటింగ్ మొదలుపెట్టేది ‘విక్రమ్’ సినిమానే. కమల్ హాసన్.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ‘విక్రమ్’ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి షూటింగ్‌ని స్పీడప్ చెయ్యాలంటే.. చెన్నైలో ఇంకా షూటింగ్‌కి పర్మిషన్ రాలేదు కాబట్టి.. హైదరాబాద్‌లోనే షూటింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు ‘విక్రమ్’ టీమ్. ఇలా తమిళ్ స్టార్లే కాదు.. కన్నడ, బాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లోనే షూట్ చేద్దామని డిసైడ్ అవుతున్నారు.