Inspirational story of Shivaji Patil : కార్గిల్ యుద్ధంలో వేళ్లు పోగొట్టుకున్నాడు .. కిరాణా దుకాణం నడుపుతున్నాడు..

కార్గిలో పోరులో పాల్గొన్నాడు. తన వేళ్లు పోగొట్టుకున్నాడు. తన పరిస్థితి చూపించి ప్రభుత్వం నుంచి సాయం కోరకుండా తన స్వశక్తితో నిలబడి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. శివాజీ పాటిల్ స్ఫూర్తివంతమైన కథను అతని అల్లుడు నితిన్ కామత్ ట్విట్టర్ లో షేర్ చేశాడు.

Inspirational story of Shivaji Patil : కార్గిల్ యుద్ధంలో వేళ్లు పోగొట్టుకున్నాడు .. కిరాణా దుకాణం నడుపుతున్నాడు..

Inspirational story of Shivaji Patil

Updated On : May 10, 2023 / 11:57 AM IST

Inspirational story of Shivaji Patil :  కార్గిల్ యుద్ధంలో అతను వేళ్లు పోగొట్టుకున్నాడు. అందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం ఆశించలేదు. కిరాణా దుకాణం పెట్టుకుని సంతోషంగా బతుకుతున్నాడు. 70 ఏళ్ల శివాజీ పాటిల్ గురించి అతని అల్లుడు చెప్పిన స్ఫూర్తివంతమైన అంశాలు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి.

Female Uber driver story : బీటెక్ గ్రాడ్యుయేట్ ఉబెర్ డ్రైవర్‌గా ఎందుకు మారింది?

70 ఏళ్ల శివాజీ పాటిల్ కర్ణాటకలోని బెల్గాంలో నివసిస్తున్నారు. ఒకప్పుడు కార్గిల్ యుద్ధంలో పోరాటం చేశారు. ఆ యుద్ధంలో వేళ్లను పోగొట్టుకున్నారు. ఆ కారణం చెప్పి ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం పొందలేదు. ఆశించలేదు. బెల్గాంలోనే ఓ కిరాణా దుకాణం పెట్టుకుని సంతోషంగా జీవిస్తున్నారు. పాతకాలం నాటి స్కూటర్‌పై స్ధానిక మార్కెట్‌కి వెళ్తారు. సరుకులు తెచ్చి విక్రయిస్తుంటారు.

ఆయన భార్య అటు ఇంటిని చూసుకుంటూనే దుకాణంలో భర్తకు సాయం చేస్తారు. సంతృప్తిని మించిన సంతోషం లేదన్నట్లు చాలా సింపుల్ గా జీవితాన్ని గడుపుతున్న శివాజీ పాటిల్ కథ తనకు ఆదర్శం అంటూ ఆయన అల్లుడు నితిన్ కామత్ తన మామగారి స్టోరిని ట్విట్టర్ లో షేర్ చేశారు.

74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి

శివాజీ కుమార్తెను వివాహం చేసుకుంటానని కామత్ అడిగినపుడు ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రం తనతో ఒప్పించారని కామత్ చెప్పుకొచ్చాడు. డబ్బుతో ఎటువంటి ఆనందాన్ని కొనలేమని.. తన మామగారి లాగ ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. మంచి జీవితాన్ని ఎలా గడపాలనేది ఆలోచిస్తున్నానని అంటూ కామత్ ట్వీట్ లో తెలిపాడు.

 

అన్ని విషయాల్లో తన మామగారు తనకెంతో ప్రేరణ అంటూ కామత్ పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. “జీవితంలో ఆటుపోట్లు ముందుగా గుర్తించిన వ్యక్తి ప్రశాంతంగా జీవిస్తాడని కొందరు.. శివాజీ పాటిల్ చాలామందికి స్ఫూర్తి” అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

 

ఏదో కారణం చూపించి సాయం అందుకోవాలని చాలామంది ఆశిస్తారు. యుద్ధంలో వేళ్లు కోల్పోయినా ఎవరి మీద ఆధారపడకుండా తన కష్టాన్ని నమ్ముకున్న శివాజీ పాటిల్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.