కరోనాను పూర్తిగా ఖతం చేసినట్లు ప్రకటించిన ఇటలీ సరిహద్దు దేశం

  • Published By: venkaiahnaidu ,Published On : May 15, 2020 / 11:33 AM IST
కరోనాను పూర్తిగా ఖతం చేసినట్లు ప్రకటించిన ఇటలీ సరిహద్దు దేశం

Updated On : October 31, 2020 / 2:49 PM IST

కరోనాను పూర్తిగా ఖతం చేసినట్లు యూరప్ దేశమైన స్లోవేనియా ప్రకటించింది. గత రెండు వారాలుగా దేశంలో రోజుకు రెండు కేసులు మాత్రమే నమోదు చేస్తున్నామని.. క్రమంగా కరోనాను పూర్తిగా అంతమొందించినట్లు స్లోవేనియా ప్రభుత్వం తెలిపింది. కరోనా ఖతం చేయడంతో శుక్రవారం సరిహద్దులను ఓపెన్ చేసింది స్లోవేనియా. కరోనాను పూర్తిగా అంతమొందించిన మొదటి యూరప్ దేశంగా నిలిచిన స్లోవేనియా…కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ఇటలీ పొరుగు దేశమన్న విషయం తెలిసిందే.

పబ్లిక్ గేథరింగ్(ప్రజలు ఒక చోట గుమిగూడటం)బ్యాన్ కొనసాగుతుందని,పబ్లిక్ ప్లేస్ లలో సోషల్ డిస్టెన్స్ పాటించడం,మాస్క్ ధరించడం తప్పనిసరి అని స్లోవేనియా తెలిపింది. ఈ రోజు స్లోవేనియాలో ఐరోపాలో అత్యుత్తమ మహమ్మారి పరిస్థితి ఉంది. ఇది సాధారణ అంటువ్యాధిని విరమించుకోవడానికి మాకు వీలు కల్పిస్తుంది అని కరోనాను అంటువ్యాధి ప్రకటించిన రెండు నెలల తరువాత ప్రధాన మంత్రి జానెజ్ జాన్సా అన్నారు. స్లోవేనియా… యూరప్‌కు మహమ్మారి చికిత్సాలయంగా మారిందని ప్రధాని జాన్స్ హర్షం వ్యక్తం చేశారు.

ఇటలీ సరిహద్దులో ఉన్న రెండు మిలియన్ల జనాభా కలిగిన పర్వత దేశమైన స్లోవేనియా గురువారం నాటికి సుమారు 1,500 కరోనా వైరస్ కేసులు మరియు 103 మరణాలను నమోదైనట్లు రిపోర్ట్ చేసింది. కొత్త కేసుల రేటు తగ్గడంతో, అన్ని యూరోపియన్ పౌరులకు సరిహద్దులను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే నాన్-EU పౌరులు తమ దేశానికి వస్తే క్వారంటైన్‌ లో ఉండాల్సిందేనని తెలిపింది. అంతేకాకుండా మే-23నుంచి ఫుట్ బాల్ మరియు అన్ని ఇతర కాంపిటీషన్స్ పునరుద్దరణ జరిగే అవకాశముందని ప్రభుత్వం తెలిపింది.

అయితే మరోవైపు, కరోనాను పూర్తిగా అంతమొందించామని స్లోవేనియా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ…దేశంలో ఇంకా కరోనా మహమ్మారి ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఏ యూరోపియన్ దేశం కూడా కరోనాను ఖతం చేసినట్లు ప్రకటించలేదని,స్లోవేనియా కూడా జాగ్రత్తగా ఉండాలని ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నిపుణుడు మాటేజా లోగర్ తెలిపారు.

Read Here>> చైనాతో అమెరికా సంబంధాలు కట్…జిన్ పింగ్ తో మాట్లాడనన్న ట్రంప్