SpiceJet: మరో స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్… ఒకే రోజు రెండు ఘటనలు

గుజరాత్‌లోని కాండ్ల నుంచి బయలుదేరిన స్పైస్‌జెట్ క్యూ400 అనే విమానాన్ని మంగళవారం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం విమానం 23 వేల అడుగుల ఎత్తులో ఉండగా, విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ (విమానం అద్దం)లో పగుళ్లు ఏర్పడ్డాయి.

SpiceJet: మరో స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్… ఒకే రోజు రెండు ఘటనలు

Spicejet

Updated On : July 5, 2022 / 8:16 PM IST

SpiceJet : ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్ విమానాల్ని వరుసగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తోంది. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానం పాకిస్తాన్‌లోని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన రోజు సాయంత్రమే మరో స్పైస్‌జెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

గుజరాత్‌లోని కాండ్ల నుంచి బయలుదేరిన స్పైస్‌జెట్ క్యూ400 అనే విమానాన్ని మంగళవారం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం విమానం 23 వేల అడుగుల ఎత్తులో ఉండగా, విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ (విమానం అద్దం)లో పగుళ్లు ఏర్పడ్డాయి. వెంటనే గుర్తించిన సిబ్బంది, విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇది ప్రయారిటీ ల్యాండింగ్ అని స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని వివరించింది.

SpiceJet Flight: కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన స్పైస్ జెట్ విమానం

ఒకే రోజు స్పైస్‌జెట్ సంస్థకు చెందిన రెండు విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గత పదిహేడు రోజుల్లో ఇలా స్పైస్‌జెట్ విమానాలు అత్యవసరంగా ల్యాండ్ కావడం ఇది ఏడోసారి. ఇటీవలే ఒక స్పైస్‌జెట్ విమానంలో పొగలు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.