Supreme Court On Freebies: ఆ విషయంలో రాజకీయ పార్టీలను అడ్డుకోలేం.. పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి, ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రింకోర్టు అభిప్రాయ పడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది.

Supreme Court On Freebies: ఆ విషయంలో రాజకీయ పార్టీలను అడ్డుకోలేం.. పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Supreme Court

Updated On : August 17, 2022 / 2:48 PM IST

Supreme Court On Freebies: ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మేనిఫెస్టోలను నియంత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని నిర్ధేశించాలని, ఇలాంటి ఉచిత వాగ్ధానాలకు రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేయాలని అశ్వినీకుమార్ పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ పై సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court Comments On Talaq : తలాక్‌ విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..‘తలాక్-ఇ-హసన్ సరైనదే’

రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి, ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని కోర్టు అభిప్రాయ పడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది. అయితే ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పడం సరికాదని కోర్టు తెలిపింది.

Telangana High court New Judges : తెలంగాణ హైకోర్టులో ఆరుగురు కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం

ఏది ఉచితం, ఏది కాదనే విషయాలపై చర్చించి సూచనలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దీనిపై మీ సలహాలు ఇవ్వండి అంటూ వ్యాజ్య దారులకు జస్టిస్ రమణ సూచించారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.