Swiggy : డెలివరీ బాయ్స్‌కు గుడ్ న్యూస్
డెలివరీ బాయ్స్ కీలక పాత్ర పోషిస్తుంటారు. ఆర్డర్ చేయడం ఆలస్యం.. వెంటనే వాటిని తీసుకుని ఇంటి వరకు చేరవేస్తుంటారు...

Swiggy
Swiggy Delivery Boys : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ లో స్విగ్గీ (Swiggy)కి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి నిత్యం ఈ యాప్ ద్వారా వేలాది మంది ఫుడ్ ఆర్డర్స్ పెడుతుంటారు. అయితే.. ఇందులో డెలివరీ బాయ్స్ కీలక పాత్ర పోషిస్తుంటారు. ఆర్డర్ చేయడం ఆలస్యం.. వెంటనే వాటిని తీసుకుని ఇంటి వరకు చేరవేస్తుంటారు. వీరి విషయంలో స్విగ్గీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్ లుగా పని చేస్తున్న వారు ‘స్టెప్ ఎ హెడ్’ కార్యక్రమం కింద ఉద్యోగాల్లో చేరవచ్చని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 2.7 లక్షల మంది డెలివరీగా పని చేస్తున్నారు. వీరికి అనేక అవకాశాలు కల్పిస్తోంది.
Read More : Elon Musk: ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్
ప్రమాద బీమా, పర్సనల్ లోన్స్, న్యాయ సలహా ఇతరత్రా సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో మహిళలు కూడా ఉండడం విశేషం. చదువుకుంటూ.. పార్ట్ టైం జాబ్ లేక అదనపు డబ్బుల కోసం స్విగ్గీ (Swiggy)లో పని చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం మరిన్ని అవకాశాలు కల్పించాలని అనుకుంటున్నట్లు స్విగ్గీ వెల్లడించింది. అందులో భాగంగా స్టెప్ ఎ హెడ్ పేరిట సంస్థ నిర్వహణ సంబంధిత స్థాయిలో ఉద్యోగులుగా మారే అవకాశం ఉందని సంస్థ నిర్వహణ ఉపాధ్యక్షులు మిహిర్ రాజేశ్ షా తెలిపారు. ఇక ఇందులో ఫుల్ టైమ్ జాబ్ లో పని చేయాలంటే.. డెలివరీ ఎగ్జిక్యూటివ్ లో డిగ్రీ పట్టభద్రులై ఉండాల్సి ఉంటుంది. అంతేగాకుండా.. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పై అవగాహన కలిగి ఉండాలి. ప్లీట్ మేనేజర్స్ గా వివిధ రకాల పాత్రలను వారు పోషించాల్సి ఉంటుంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్ లో నుంచి 20 శాతం మందిని ప్లీట్ మేనేజర్స్ గా నియమించుకోవాలని ప్రస్తుతం స్విగ్గీ యోచిస్తోంది. అత్యధిక కాలం స్విగ్గీ కోసం పని చేసిన వారికి కంపెనీ ప్రాధాన్యం కల్పించనుంది.