Elon Musk: ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్
ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు ఎలన్ మస్క్ గతంలో ఆ సంస్థకు 43 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ముందుకొచ్చాడు.

Elon Musk
Elon Musk: ట్విట్టర్-ఎలన్ మస్క్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న ట్విట్ర్ స్వాధీన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లే కనబడుతోంది. ఇప్పటికే ట్విట్టర్‌లో వాటా కొనుగోలు చేసిన ఎలన్ మస్క్, తాజాగా ఆ సంస్థను పూర్తిగా సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు ఎలన్ మస్క్ గతంలో ఆ సంస్థకు 43 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ముందుకొచ్చాడు.
Elon Musk: టెస్లా కార్లకంటే రోబోలతోనే ఎక్కువ వ్యాపారం: ఎలన్ మస్క్
అయితే, ఈ ప్రతిపాదనను ట్విట్టర్ తిరస్కరించింది. అయినప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయని కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్రస్తుతం కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చే అవకాశం ఉంది. ఎలన్ మస్క్ ఇస్తానన్న దానికంటే మరింత ఎక్కువ అమౌంట్‌తో ట్విట్టర్ ఎలన్ మస్క్‌కు ప్రతిపాదనలు పంపనుంది. దీనికి మస్క్ అంగీకరిస్తే.. ట్విట్టర్ మస్క్ సొంతం కావడం ఖాయం.