Telangana BJP : కాషాయ కండువా కప్పుకున్న ఈటల

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల బీజేపీలోకి చేరారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఆయన..తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Telangana BJP : కాషాయ కండువా కప్పుకున్న ఈటల

Etela

Updated On : June 14, 2021 / 12:12 PM IST

Ex Minister Etela Rajender : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల బీజేపీలోకి చేరారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఆయన..తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి..పార్టీలోకి స్వాగతం పలికారు. ఈటలతో పాటు.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి సహా.. మరికొందరు నాయకులు.. బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి ఈటెల రాజేందర్ బృందం వెళ్లనుంది.

బీజేపీలో చేరిన అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఘన స్వాగతం పలికేందుకు ఈటల అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. ఈటల చేరికకంటే ముందే హైప్ క్రియేట్ చేసిన కమలం పార్టీ నేతలు.. ముందు ముందు ఉద్యమకారులను తమవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Read More :Brahmamgari Matam : బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ నియామకం, జీతాల కోసం సిబ్బంది ఎదురు చూపులు