Former Pakistan coach: నీ బ్యాటింగ్ నువ్వు చేయి.. కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ కోచ్
బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, బంగ్లా కెప్టెన్ షకీబ్ మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నువ్వు బ్యాటింగ్ చేయి, అంపైర్లను వారి పని చేయనివ్వండి’ అని యూనిస్ అన్నాడు. కోహ్లీ అంపైర్లకు అలా చెప్పడం కరెక్ట్ కాదుంటూ యూనిస్ పేర్కొన్నాడు.

Virat Kohli
Former Pakistan coach: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ సెమీస్ కు వెళ్లడం దాదాపు ఖాయమైంది. సూపర్ – 12 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్‌కు గట్టి పోటీని ఇచ్చింది. చివరికి ఐదు పరుగుల తేడాతో (DLS పద్ధతి) పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి (44 బాల్స్‌లో 64 పరుగులు) చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహ్మద్ వేసిన 16వ ఓవర్ చివరి బంతికి కోహ్లీ షార్ట్ బాల్‌ను ఎదుర్కొన్నాడు. వెంటనే కోహ్లీ బాల్ ఎత్తును స్క్వేర్-లెగ్ అంపైర్ వైపు సూచించాడు.
Virat Kohli : విరాట్ కోహ్లీ మరో రికార్డ్.. ఆ ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా ఘనత
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పరుగెత్తుకుంటూ వచ్చి అంపైర్ వైపు కోహ్లీ చేసిన సంజ్ఞ గురించి మాట్లాడాడు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ తమ తమ స్థితికి చేరుకున్నారు. ఈ సన్నివేశంపై పాకిస్థాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ కోహ్లీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘నువ్వు బ్యాటింగ్ చేయి, అంపైర్లను వారి పని చేయనివ్వండి’ అని షకీబ్ కోహ్లీతో చెబుతున్నాడని అనుకుంటున్నా అంటూ యూనిస్ అన్నాడు. కోహ్లీ అంపైర్లకు అలా చెప్పడం కరెక్ట్ కాదు.. అపైర్లు వాళ్లపని వారు చేసుకుంటారు. కోహ్లీ పేరున్న క్రికెటర్ కావటంతో అపైర్లు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతారు అని వకార్ యూనిస్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో పేర్కొన్నాడు.
View this post on Instagram
Virat Kohli: కోహ్లీ కళ్లల్లో నీళ్లు.. పాక్‌పై గెలుపు తర్వాత విరాట్ భావోద్వేగం
కోహ్లీ ఇన్నింగ్స్ గురించి యూనిస్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 1,016 పరుగులను కోహ్లీ అధిగమించాడు. జయవర్ధనే 31 ఇన్నింగ్స్‌లలో ఆ పరుగులు చేయగా.. కోహ్లీ కేవలం 23 మ్యాచ్ లలో మాత్రమే చేశాడు. అతను గొప్ప ఆటగాడు అని చెప్పడానికి ఈ గణాంకాలు చాలు అని యూనిస్ అన్నాడు.