Viral Video: టిక్‌టాక్‌ పిచ్చి.. కుర్చీలో ఇరుక్కుపోయింది!

Viral Video: టిక్‌టాక్‌ పిచ్చి.. కుర్చీలో ఇరుక్కుపోయింది!

Tiktok Madness Girl Stuck In A Chair

Updated On : June 14, 2021 / 7:19 PM IST

Viral Video: మన దేశంలో ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ చాలా దేశాలలో దీని హవా కొనసాగుతూనే ఉంది. తమ వీడియోల వ్యూస్ కోసం కొందరు పడరాని పాట్లు పడుతూనే ఉండగా మరికొందరు ప్రాణాల మీదకి సైతం తెచ్చుకుంటున్నారు. అలానే ఓ అమెరికన్ యువతి టాక్ టాక్ వీడియో కోసం ఓ ఇనుప కుర్చీలో దూరింది.

కానీ అందులో నుండి బయటపడడం తెలియకపోవడంతో ఎంత ప్రయత్నించినా కుదరక చివరికి రెస్క్యూ టీంకి ఫోన్ చేయడంతో వారు వచ్చి కుర్చీని కట్ చేసి ఆమెని విడిపించారు. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన సిడ్నీ జో అనే యువతి చాలా రోజుల టిక్ టాక్ వీడియోలు తయారుచేసి పాపులారిటీ పెంచుకుంటుంది. అలానే కొద్దిరోజుల క్రితం కుర్చీలోకి దూరి టిక్‌టాక్‌ వీడియోలు చేయటం ప్రారంభించింది.

అలానే ఆరోజు కూడా కుర్చీలో దూరిన యువతి వీడియో అయిపోయిన తర్వాత కుర్చీలోంచి బయటకు రావాలని చూసింది. కానీ అందులో నుండి ఎంత ప్రయత్నించినా బయటకి రాలేకపోవడంతో చేసేదేం లేక చివరికి రెస్క్యూ టీంకి ఫోన్ చేసింది. వారు వచ్చి కుర్చీని కట్‌ చేసి ఆమెను విడిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.