Headlines: కేసీఆర్‭ను పరామర్శించిన చినజీయర్.. బీజేపీకి ఓటేసిందని మహిళను విపరీతంగా కొట్టిన భర్త-బావ

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు.

Headlines: కేసీఆర్‭ను పరామర్శించిన చినజీయర్.. బీజేపీకి ఓటేసిందని మహిళను విపరీతంగా కొట్టిన భర్త-బావ

Today Headlines in Telugu at 11PM

Updated On : December 9, 2023 / 10:56 PM IST

కేసీఆర్‭ను పరామర్శించిన చినజీయర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‭ను చినజీయర్ పరామర్శించారు. ఫాంహైజ్ లో కాలి జారి కిందపడడంతో గాయాలపాలై ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కేసీఆర్. కాగా, చినజీయర్ స్వయంగా యశోదా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బీజేపీకి ఓటేసిందని మహిళను విపరీతంగా కొట్టిన భర్త-బావ
బీజేపీకి ఓటు వేసినందుకు ముస్లిం మహిళపై కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధితురాలి పేరు బీ.సమీనా. డిసెంబర్ 3న విడుదలైన ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. అనంతరం డిసెంబర్ 4న ఆమె తమ కుటుంబంతో వేడుక చేసుకుంటోంది. ఇదే ఆమెను కష్టాల్లోకి నెట్టింది. ఆమె బీజేపీకి ఓటు వేసిందని ఆమె బావ జావేద్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆమెను మొదట దుర్భాషలాడి, ఆపై కర్రతో కొట్టాడు. ఇక ఆయనకు మద్దతుగా భర్త కూడా చేరిపోయాడు. ఇద్దరూ కలిసి ఆమెను విపరీతంగా కొట్టారు.

ఎంపీ డానిష్ అలీని బీఎస్పీ నుంచి సస్పెండ్
లోక్‭సభ సభ్యుడు డానిష్ అలీని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ సుప్రెమో మాయావతి చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయవద్దని ఆయనకు చాలాసార్లు మౌఖికంగా చెప్పానని, అయినప్పటికీ పార్టీపై నిరంతరం ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నానని బీఎస్పీ విడుదల చేసిన ప్రకటనలో ఆమె తెలిపారు.

ఆర్టీసి బస్సులో మహిళలతో మాట్లాడినా జగ్గారెడ్డి
మహాలక్ష్మీ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ఉచిత టికెట్ మీద ప్రయాణిస్తున్న మహిళలతో మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడారు. జీవితంలో కాంగ్రెస్ పార్టీని మరవకండంటూ మహిళలకు సూచించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ మాట ఇచ్చిన్నట్లే ఈ రోజు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసి బస్సులో మహిళలకు టికెట్ లేకుండా ఉచితంగా మొదలు పెట్టినట్లు ఆయన చెప్పారు.

ఇరిటేషన్ రాజకీయాలు..
ప్రకాశం జిల్లాలో ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలంటేనే విరక్తిపుడుతోందన్నారు.

రద్దు రాజకీయం..
తెలంగాణలో ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేశారు. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. సోమేశ్ కుమార్, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్,జీఆర్ రెడ్డి, ఆర్. శోభల నియామకాలు రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

కోలుకుంటున్న కేసీఆర్..
మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.  ఆస్పత్రిలో వాకర్  సాయంతో డాక్టర్లునడిస్తుండగా  కేసీఆర్ అడుగులు వేస్తున్నాు. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

రైతు బంధు ఎప్పుడు..?
రైతుబంధు ఎప్పుడిస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుల పక్షాన అడుగుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రైతుబంధు డబ్బులు డిసెంబర్ 9న ఇస్తామన్నది కాంగ్రెస్ వారేనని స్పష్టం చేశారు. రైతాంగం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందన్నారు.

సీఎం ప్రారంభం..
మహా లక్ష్మీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో మూడు బస్‌లు ప్రారంభించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులతో కలిసి ప్రారంభించారు.

కొత్త సీఎం గుస్సా
ట్రాఫిక్‌ పోలీసులపై సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అసహనం వ్యక్తంచేశారు.

ఊరుకోను..
ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అందరు కలిసి..కష్టపడి పనిచేయాలని సూచించారు. పనిచేసినవారిక తగిన గుర్తింపు ఉంటుందని..గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తానని..పనితీరు బాగా లేకపోతే పక్కనపెట్టేస్తానని స్పష్టంచేశారు.

గ్యారంటీలపై గ్యారెంటీ..
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీల్లో సీఎం రేవంత్ రెడ్డి రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు రెడీ అయ్యారు. మహాలక్ష్మీ, చేయూత పథకాలను ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు నుంచే అమలులోకి రానుంది.

NIA దూకుడు
మహారాష్ట్ర, కర్ణాటకలో NIA సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఏకకాలంలో 41 ప్రదేశాల్లో దాడులు చేపట్టారు. 13 మంది అరెస్ట్ చేశారు.

అనే నేను..
అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. మొదటి సీఎం రేవంత్ రెడ్డి, తరువాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేసిన తరువాత మిగిలివారంతా చేశారు.

మంత్రులకు శాఖల కేటాయింపు
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారికి శాఖల కేటాయింపు జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం మంత్రుల శాఖలకు  ఆమోదముద్ర వేసింది.ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అధిష్టానంతో చర్చలు జరిపిన అనంతరం శాఖల కేటాయింపు జరిగింది.

మరింత అభివృద్ధి
సింహాచలం రైల్వే స్టేషన్ ను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు.మరమ్మతులకు 20 కోట్లు మంజూరు చేశారు.

కేసీఆర్..
బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకున్నారు. ఏకగ్రీవ తీర్మానంతో కేసీఆర్ ను ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం ఎంపిక కేసీఆర్ కు అప్పగిస్తున్నట్లుగా నిర్ణయించారు.

ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణం..
ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఆరోసారి.

గుట్టలు గట్టలుగా నోట్ల కట్టలు..
ఒడిశాలో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. 30 మంది అధికారులు ఎనిమిది కౌంటింగ్‌ మిషిన్లతో నిరంతరాయంగా లెక్కించినా నోట్ల కట్టల గుట్ట తగ్గలేదు. మూడు రోజులు మరో మూడు మిషిన్లను తెప్పించి రాత్రి పగలు లెక్కిస్తే కానీ నోట్ల కట్టల సంచుల లెక్క తేలలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైడ్స్‌లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశా నోట్ల కట్టల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ వార్తకు సంబంధించిన క్లిప్పింగును తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన ప్రధాని.. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి రూపాయిని వెనక్కి రప్పించే గ్యారంటీ నాది అంటూ హామీ ఇచ్చారు.

స్టూడెంట్‌ వీసా డిపాజిట్ రెట్టింపు!
ఉన్నత విద్యకోసం కెనడా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. స్టడీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల ఆర్థిక సంసిద్ధతను పెంచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్టూడెంట్‌ డిపాజిట్‌ను భారీగా పెంచింది. దీనిని ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20వేల 635 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 1 జనవరి 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.

రష్యాలో ఎన్నికలు!
రష్యాలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి వ్లాదిమిన్‌ పుతిన్‌ పోటీలోకి దిగనున్నారని సమాచారం. వ్లాదిమిర్‌ పుతిన్‌ రష్యా అధ్యక్ష పదవిని ఐదోసారి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ పదవికి పోటీ చేయడంపై ఆయన ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఉచిత ప్రయాణం ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టింది.  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని ఇవాళ్టి నుంచి అమలు చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచే మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయాన్ని కల్పించింది. తెలంగాణ పరిధిలో టీఎస్‌ఆర్టీసీ, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.