Woman Cyclist: కోచ్‌ అసభ్య ప్రవర్తన.. మహిళా సైక్లిస్ట్ ఫిర్యాదు

జాతీయ సైక్లింగ్ టీమ్ కోచ్‌గా ఉన్న ఆర్‌కే శర్మ తనపై అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది ఒక మహిళా సైక్లిస్ట్. ఈ అంశంపై ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.

Woman Cyclist: కోచ్‌ అసభ్య ప్రవర్తన.. మహిళా సైక్లిస్ట్ ఫిర్యాదు

Woman Cyclist

Updated On : June 7, 2022 / 12:56 PM IST

Woman Cyclist: జాతీయ సైక్లింగ్ టీమ్ కోచ్‌గా ఉన్న ఆర్‌కే శర్మ తనపై అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది ఒక మహిళా సైక్లిస్ట్. ఈ అంశంపై ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నెల 18 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో ఆసియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు.

Crop Holiday: క్రాప్ హాలిడే దిశగా కోనసీమ రైతులు

దీనికి సన్నాహకంగా స్లొవేనియాలో ప్రిపరేషన్ క్యాంపు నిర్వహించారు. ఫిర్యాదు చేసిన మహిళా సైక్లిస్టుతోపాటు, భారత సైక్లిస్టుల బృందం, నేషనల్ స్ప్రింట్ టీమ్ కోచ్‌గా ఉన్న ఆర్‌కే శర్మ ఈ క్యాంపులో ఉన్నారు. అయితే, ఈ క్యాంపులో శర్మ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు మహిళా సైక్లిస్టు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై శాయ్, సైక్లిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) స్పందించాయి. ఈ అంశంపై విచారణ జరిపేందుకు రెండూ వేరువేరు కమిటీలను ఏర్పాటు చేశాయి. ఈ ఫిర్యాదుపై శాయ్ ఒక ప్రకటనలో స్పందించింది. ‘‘స్లొవేనియాలో కోచ్‌ అసభ్య ప్రవర్తనపై మహిళా అథ్లెట్ ఫిర్యాదు చేసింది.

Medicines: ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు.. త్వరలో కొత్త చట్టం

దీనిపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అలాగే ఫిర్యాదు చేసిన మహిళ భద్రత దృష్ట్యా వెంటనే ఆమెను ఇండియాకు రప్పించాం. దీనిపై విచారణ జరిపి త్వరలోనే సరైన పరిష్కారం కనుగొంటాం’’ అని శాయ్ పేర్కొంది. మరోవైపు సీఎఫ్ఐ కూడా సొంతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపుతోంది. ఆర్‪‌కే శర్మ సైక్లిస్టుల బృందంతో 2014 నుంచి పనిచేస్తున్నారు. ఆయనను కోచ్‌గా నియమించింది సీఎఫ్ఐ.