Man Dies Eating Omelette: ప్రాణం తీసిన ఆమ్లెట్.. జనగామ జిల్లాలో విషాద ఘటన
జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మద్యం తాగేందుకు బార్ లోకి వెళ్లాడు. తనకు కావాల్సిన మద్యాన్ని తీసుకొని పర్మిట్ రూంలో కూర్చున్నాడు. స్టఫ్ కింద ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాడు. మద్యం తాగుతూ ఆమ్లెట్ తింటున్న క్రమంలో ఆమ్లెట్ ముక్క గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలు వదిలాడు.

Eating Omelette
Man Dies Eating Omelette: ఆమ్లెట్ తింటూ ఓ వ్యక్తి మరణించిన విషాద ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన భూపాల్ రెడ్డి స్థానిక మద్యం దుకాణంలోకి వెళ్లాడు. అతడు తాగే బ్రాండ్ ను తీసుకున్నాడు. పక్కనే ఉన్న పర్మిట్ రూంలోకి వెళ్లాడు. మద్యం తాగుతున్న క్రమంలో స్టఫ్ కోసం ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ అమ్లెటే అతని ప్రాణం తీసింది.
మద్యం తాగుతున్న క్రమంలో భూపాల్ ఆమ్లెట్ ను తిన్నాడు. అయితే అది ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో గిలగిలా కొట్టుకొని అక్కడికక్కడే భూపాల్ రెడ్డి ప్రాణాలు వదిలాడు. బార్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమ్లెట్ గొంతులో ఇరుక్కొనే చనిపోయాడా? మరేదైనా కారణం ఉందా అనేకోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.