Illegal Relationship: భర్తను హత్యచేసి ప్రియుడితో పరారైన భార్య.. కూతురు ఫిర్యాదుతో ఆర్నెళ్లకు పోలీసులకు చిక్కిన నిందితులు..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్యచేసింది. ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.

Illegal Relationship: భర్తను హత్యచేసి ప్రియుడితో పరారైన భార్య.. కూతురు ఫిర్యాదుతో ఆర్నెళ్లకు పోలీసులకు చిక్కిన నిందితులు..

illegal relationship

Updated On : November 4, 2022 / 12:17 PM IST

Illegal Relationship: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్యచేసింది. ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. చాలాకాలంగా పరారీలో ఉన్న వారి ఆచూకీ చెప్పిన వారికి రూ.10వేల రివార్డునుకూడా పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత పోలీసులు మహిళ, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు  ఇద్దరికి జైలు శిక్ష విధించడంతో.. వారిని  జైలుకు తరలించారు.

Illegal Relationship: ప్రియుడితో కలిసి కుమారుడ్ని హతమార్చిన తల్లి.. నెల రోజుల తరువాత గుట్టురట్టు

మంగళ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి అలియాపూర్ గ్రామంలో 2022 ఏప్రిల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన తరువాత మృతుడు కుమార్తె మధు తల్లి ఊర్మిళ, ఆమె ప్రేమికుడు సునీల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యకేసు నమోదు చేశారు. హత్య అనంతరం వారిద్దరూ చాలాకాలంగా పరారీలో ఉన్నారు. నిందితులిద్దరి ఆచూకీ తెలిపితే పదివేలు రివార్డునుకూడా జిల్లా ఎస్పీ ప్రకటించారు.

8 fetuses in Stomach of 21 days girl baby : 21 రోజుల ఆడశిశువు కడుపులో 8 పిండాలు..! ఝార్ఖండ్‌‌లో ప్రపంచంలోనే అరుదైన ఘటన..!

నిందితులిద్దరినీ పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం అర్థరాత్రి ఇన్‌ఫార్మర్‌ సమాచారం మేరకు మంగళ్‌పూర్‌ పోలీసులు వెతుకగా నిందితులు సునీల్‌, ఊర్మిళను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారించగా.. హత్యచేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. అయితే, పోలీసుల కస్టడీలో నిందితుడు సునీల్ తనకు ఊర్మిళతో 20ఏళ్లుగా ప్రేమ వ్యవహారం ఉందని చెప్పారు. దీనిని ఆమె భర్త వ్యతిరేకించాడని, అందరి ముందు ఊర్మిళను చాలాసార్లు అవమానించాడని అన్నాడు. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు సంతోష్ ను గొంతునులిమి హత్యచేసి చేసినట్లు పోలీసుల విచారణలో సునీల్ తెలిపాడు. ఇందులో భార్య ఊర్మిళ పాత్రకూడా ఉంది. ప్రస్తుతం నిందితులిద్దరూ జైలుకెళ్లారు.