Kesineni Nani: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం

తన సోదరుడు శివనాథ్‌ ( చిన్ని ) భార్య జానకి లక్ష్మిపై కేశినేని నాని పోలీస్ కేసు పెట్టారు. ఆమె కారుపై తన ఎంపీ స్టిక్కర్ వేసుకున్నార‌ని నెల రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కారును త‌నిఖీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన తమ్ముడు శివనాథ్‌తో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయన్న‌ భావనలో కేశినేని నాని ఉన్నారు. ఇప్పుడు వారి మ‌ధ్య వివాదం మ‌రింత పెరిగింది.

Kesineni Nani: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం

Kesineni Nani

Updated On : July 20, 2022 / 10:57 AM IST

Kesineni Nani: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం రాజుకుంది. ఒక‌రు తన పేరును, హోదాను వాడుకుంటున్నారని ఇటీవ‌ల విజయవాడ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్‌) పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న పేరిట‌ వీఐపీ వాహన స్టిక్కర్‌ నకిలీది వాడుతూ విజయవాడ, హైదరాబాద్‌లో తిరగుతున్నారని ఆయ‌న చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దీంతో 151 సీఆర్పీ సెక్షన్ కింద పడమట పోలీసులు కేసు న‌మోదు చేశారు.

 

తన సోదరుడు శివనాథ్‌ ( చిన్ని ) భార్య జానకి లక్ష్మిపై కేశినేని నాని ఈ పోలీస్ కేసు పెట్టారు. ఆమె కారుపై తన ఎంపీ స్టిక్కర్ వేసుకున్నార‌ని నెల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కారును త‌నిఖీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన తమ్ముడు శివనాథ్‌తో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయన్న‌ భావనలో కేశినేని నాని ఉన్నారు. ఇప్పుడు వారి మ‌ధ్య వివాదం మ‌రింత పెరిగింది.

 

విజయవాడ ఎంపీగా నాని టీడీపీ నుంచి రెండుసార్లు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. గ‌తంలో చిన్ని త‌న అన్న నానికి తోడుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు. అయితే, ఇప్పుడు విజయవాడ ఎంపీ సీటుకి ప్రత్యామ్నాయ అభ్యర్థిగా చిన్ని ఎదగాలనుకుంటున్నార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టీడీపీ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న హుషారుగా పాల్గొంటుండ‌గా, కేశినేని నాని మాత్రం కొంత కాలంగా ఆ పార్టీ తీరుపై కొంత అసంతృప్తిగా ఉన్నారు.

srilanka crisis: శ్రీ‌లంక‌లో భార‌తీయ అధికారిపై దాడి