TS High Court : మేడారం జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు

మేడారం జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది.

TS High Court : మేడారం జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు

Ts High Court Orders To Conduct Online Classes (1)

Updated On : February 3, 2022 / 1:23 PM IST

TS High Court orders to conduct online classes : తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ విద్యాసంస్థల్లో ఆన్ లైన్ లో విద్యాబోధన కొనసాగించాలని ఆదేశించటంతో పాటు మేడారం జాతర నిర్వహణలో కోవిడ్ నిబంధనల అమలు గురించి కూడా ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది.  తెలంగాణలోనే కాదు ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదిగా పేరుగాంచిన ఆదివాసి జాతర అయిన మేడారం సమ్మక్క, సారక్క జాతర ఈ ఏడాది జరుగనుంది. ఈ జాతర నిర్వహించే భాగంగా కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయవాలని ఇది ప్రస్తుత కోవిడ్ వ్యాప్తి పరిస్థితుల్లో అత్యంత అవశ్యకమని..కచ్చితంగా కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి రెండు వారాల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. తరుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

కాగా..కోవిడ్ పరిస్థితులు..సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం జనవరి 8నుంచి మరోసారి మూసి వేసింది. జనవరి 30 వరకు మూసివేసింది. ఈక్రమంలో తిరిగి విద్యాసంస్థలు తెరిచే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పాటించాల్సిన నిబంధనల గురించి ధర్మాసనం ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. అలాగే సమక్క, సారక్క జాతర కు భక్తులు భారీగా తరలిరానున్నారు.ఈక్రమంలో కోవిడ్ వ్యాప్తి విస్తృతంగా జరిగే అవకాశముంది.దీంతో తీసుకోవాల్సిన చర్యల విషయంలో ధర్మాసనం ప్రభుత్వానికి..జాతర నిర్వహించే క్రమంలో నిబంధనల గురించి ప్రత్యేకించి సూచనలు చేసింది.

Also read : Schools Reopen : ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు పున: ప్రారంభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అలాగే..తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ధర్మాసం ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆన్ లైన్లో కూడా విద్యా బోధనను కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్లో కూడా విద్యా బోధనను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్న క్రమంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ నగరంలో కోవిడ్ పరిస్థితులపై నిబంధనలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు, బార్లు, రెస్టారెంట్లు, మార్కెట్ల వద్ద కూడా కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. కానీ కోవిడ్ నిబంధనలు చాలామంది ఉల్లంఘిస్తున్నారని..అటువంటివారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ధర్మాసనానికి తెలియజేయాని ఆదేశించింది.

Also read :  Telangana : విద్యా సంస్థల్లో ఆన్‌‌లైన్ బోధన కొనసాగించాలి.. కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా మేడారం జాతర ప్రసిద్ధి చెందింది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రాచీన చరిత్ర ఉంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు భక్తులు భారీగా తరలి వస్తారు. మాఘపౌర్ణమికి ముందు నాలుగు రోజులు సాగే మేడారం జాతరకు భక్తులు అత్యంత భారీగా పోటెత్తుతారు. ఈ జాతర ఈ ఏడాది ఈ ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది.