తిరుమల శ్రీవారి భక్తులకు మరోసారి నిరాశే, అప్పటివరకు దర్శనాలు నిలిపివేత
తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే

తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే
తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే 31వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేశారు. కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఏపీ ప్రభుత్వం కూడా మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్న ఆలయంలో దర్శనాన్ని అప్పటివరకు ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత దర్శనాల విధివిధానాలపై ఈ నెల 28న టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భక్తులకు దర్శనాల ఏర్పాట్లపై బోర్డు సభ్యులు చర్చించనున్నారు. కాగా, లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు టీటీడీకి రూ.300 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మే 18వ తేదీ నుంచి లాక్ డౌన్ 4 అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ 4 నిబంధనలకు అనుగుణంగా తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేశారు. మతానికి సంబంధించి ఏ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కేంద్రం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకారమే ఏపీలోనూ ఆదేశాలు కొనసాగనున్నాయి.
ఇదిలా ఉండగా, దర్శనాలను కొనసాగిస్తే భక్తులు భౌతికదూరం పాటించేలా రెండు రోజుల కిందట క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లలో అధికారులు మార్కింగ్ చేయించిన విషయం తెలిసిందే. క్యూలైన్లలో మార్కింగ్, స్టిక్కర్లు అంటించే సరికి దర్శనానికి అనుమతి ఇచ్చినట్లేనని వార్తలొచ్చాయి. కానీ, లాక్ డౌన్ 4 నిబంధనలకు అనుగుణంగా మరోసారి దర్శనాలు నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
Read Here>> అర్థరాత్రి వలస కూలీలకు స్వయంగా వండి పెట్టి ఆకలి తీర్చిన ఎస్పీ : అమ్మతనం అంటే అదే