Tirumala: తిరుమలలో ఈనెల విశేష ఉత్సవాలివే
పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన వివరాల్ని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రజాసంబంధాల అధికారి వెల్లడించారు.

Ttd
Tirumala: పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన వివరాల్ని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రజాసంబంధాల అధికారి వెల్లడించారు. ఈ నెల 5న శ్రీ రామానుజ జయంతి, భాష్యకార్ల సాత్తుమొర, శ్రీ అనంతాళ్వార్ ఉత్సవారంభం. 6న శ్రీ శంకరాచార్య జయంతి. 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.
Tirumala : మే 5 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి-టీటీడీ
14న శ్రీ నృసింహ జయంతి, శ్రీ అనంతాళ్వార్ సాత్తుమొర. 15న శ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి. 16న శ్రీ అన్నమాచార్య జయంతి. 25న శ్రీ హనుమజ్జయంతి నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది.