Uniform Civil Code : పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ బిల్లు

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి....

Uniform Civil Code : పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ బిల్లు

Parliament monsoon session

Uniform Civil Code : యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.(Parliament monsoon session) యూనిఫాం సివిల్ కోడ్ పై ప్రజల అభిప్రాయాలను కోరుతూ లా కమిషన్ ఇటీవల నోటీసు జారీ చేసింది.

DMK Minister Senthil Balaji : తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి సంచలన నిర్ణయం..మంత్రి డిస్మిస్ ఉత్తర్వు వెనక్కి

లా కమిషన్ కు దేశంలోని ప్రజల నుంచి 8.5 లక్షల అభిప్రాయాలు వచ్చాయి. లా కమిషన్, కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ప్రతినిధులను పిలిచి యూనిఫాం సివిల్ కోడ్ పై జులై నెలలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన పబ్లిక్ నోటీసుపై న్యాయ మంత్రిత్వ శాఖలోని లా ప్యానెల్, న్యాయ వ్యవహారాలు, శాసన విభాగాల ప్రతినిధుల అభిప్రాయాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వింటుంది.(Uniform Civil Code to be tabled)

Extreme Temperatures : మెక్సికోలో మండుతున్న ఎండలతో 112 మంది మృతి

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయించారు. సున్నితమైన ఈ అంశంపై ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు కూడా యూనిఫాం సివిల్ కోడ్ ను సమర్ధించింది. కానీ దేశంలో కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ఏడాది సమయమున్న నేపథ్యంలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడుతుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.