Oksana Chusovitina : వరుసగా 8 ఒలింపిక్స్ లో పాల్గొన్న రికార్డ్ ఆమెది..అందుకే ఘనమైన వీడ్కోలు
ఒక్కసారైనా ఒలింపిక్స్ లో పాల్గొనాలని ప్రతీ క్రీడాకారుడికి కల. అటువంటి ఏకంగా 8సార్లు ఒలింపిక్స్ లో పాల్గొ అరుదైన అద్భుతమైన ఘతన సాధించారు ఓ మహిళా అథ్లెట్. ఆమే ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వాల్ట్ జిమ్నాస్ట్ ’ఒక్సానా చుసోవిటినా’. వరుసగా 8 ఒలింపిక్స్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన ఆమెకు ఘనమైన వీడ్కోలు లభించింది.

Oksana Chusovitina
Oksana Chusovitina has officially competed at her 8 Olympic Games : ఐదు ఖండాలకు చెందిన ప్రతీ క్రీడాకారుడికి ఒక్కసారైనా ఒలింపిక్స్ లో పాల్గొనాలని కల. పతకం గెలవాలని ఆరాటపడతారు. అటువంటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8సార్లు ఒలింపిక్స్ లో పాల్గొనటం అంటే మాటలు కాదు అదికూడా వరుస ఒలింపక్స్ లో. దానికి అర్హత సాధించటమే ఓఘనత. అటువంటి అరుదైన అద్భుతమైన ఘతన సాధించారు ఓ మహిళా అథ్లెట్. ఆమే ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వాల్ట్ జిమ్నాస్ట్ ’ఒక్సానా చుసోవిటినా’. ఆమే వరుసగా 8 ఒలింపిక్స్‌లో పాల్గొని చరిత్ర సృష్టించారు.
ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్‌వెల్త్‌గేమ్స్, ఏషియన్ గేమ్స్ ఇలా వేటిలో పతకాలు సాధించినా..ఒలింపిక్స్‌లో సాధించే పతకానికి క్రేజ్ వేరుగా ఉంటుంది. పతకం గెలిచినా గెలవకపోయినా.. తాము ఆడుతున్న దేశం తరపున కనీసం ఒక్క ఒలింపిక్స్‌లో అయినా పాల్గొనాలని కలకంటారు. అలా ఏకంగా 8 ఒలింపిక్స్ లో పాల్గొన చరిత్ర సృష్టించారు ’ఒక్సానా చుసోవిటినా’.
1992 బార్సిలోనా ఒలింపిక్స్ మొదలుకొని 2020 (కరోనా కారణంగా వాయిదా పడి 2021 జరిగాయి)టోక్యో ఒలింపిక్స్ వరకు ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా వరుస ఒలింపిక్స్ లో పాల్గొన్నారు ఒక్సానా. అంతేకాదు..అంతేగాక మూడు దేశాల తరపున ఒలింపిక్స్‌లో ఆడిన రెండో జిమ్నాస్ట్ మహిళగా చుసోవిటినా మరో రికార్డు క్రియేట్ చేశారు. 8 ఒలింపిక్స్‌లో ఆడిన ఆమె 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. అటువంటి రెండు ఘనతలు సాధించిన ఒక్సానాకు స్టాండింగ్ ఒవేషన్(ఘనమైన వీడ్కోలు) లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తనకు ఇవే చివరి ఒలింపిక్స్ అని ఒక్సానా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే తెలిపారు. ఈసారి ఒలింపిక్స్‌లో వాల్ట్ జిమ్నాస్టిక్స్‌లో రెండు వాల్ట్స్ పూర్తి చేసి 14.166 స్కోరు నమోదు చేశాడు. అయితే ఆమె చేసిన స్కోరు సరిపోకపోవడంతో క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే వెనుతిరగాల్సి వచ్చిది. కానీ ఆమె ఈ ఆఖరి ఒలింపిక్స్ ఓ పతకం సాధించి ఉంటే ఆమె చివరి ఒలింపిక్స్ చక్కటి అనుభవాన్ని మిగిల్చేది.