Amitabh Bachchan : రోడ్డుపై వెళ్తున్న ఓ పోలీస్ వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్.. వీడియోలో ఏముంది.. అంటే?
బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన పోస్టులతో వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ వీడియోలో ఏముంది.. అంటే..

Amitabh Bachchan
Funny video shared by Amitabh Bachchan : బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదో ఒక అంశం షేర్ చేసుకుంటూ నెటిజన్లకు టచ్‌లో ఉంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో అందరిలో నవ్వు తెప్పించింది.
Amitabh Bachchan : ట్రాఫిక్ వల్ల షూటింగ్ కి లేట్ అవుతుందని.. లిఫ్ట్ అడిగి బైక్ మీద వెళ్లిన అమితాబ్..
అమితాబ్ బచ్చన్ ఇంటర్నెట్లో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు. రీసెంట్గా హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నట్లు ఆన్ లైన్లో ఫోటో పోస్ట్ చేసి వైరల్ అయ్యారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని నెటిజన్లు ఎత్తిచూపడంతో సినిమా షూటింగ్ టైంలో బైక్ ఎక్కినట్లు అమితాబ్ స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉంటే రీసెంట్గా ఆయన షేర్ చేసిన వీడియో నవ్వు తెప్పిస్తోంది. గుండు మధ్యలో పొడవాటి పోనీటైల్‌తో ఉన్న ఓ పోలీస్ రోడ్ మీద వాక్ చేసుకుంటూ వెళ్తుంటాడు. తన హెయిర్‌ని ఫాన్ లాగ గుండ్రంగా తిప్పుతూ నడిచి వెళ్తున్న విధానం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ‘ఎండ వేడిలో చల్లదనం కోసం అతను తన సొంత ఫాన్‌ను క్యారీ చేసి తీసుకు వెళ్తున్నాడు’ అనే క్యాప్షన్ కూడా యాడ్ చేసి అమితాబ్ ఈ వీడియోని షేర్ చేశారు.
అమితాజ్ షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ‘మీ నిజమైన అభిమాని కావచ్చు’ అని ఒకరు.. ‘జెన్నీ ఫ్రమ్ అల్లాడిన్’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram