ఏప్రిల్ 30న కామ్రేడ్ ‘రవన్న’ రాక..

ఏప్రిల్ 30న కామ్రేడ్ ‘రవన్న’ రాక..

Updated On : January 28, 2021 / 7:33 PM IST

Viraata Parvam: రానా దగ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాట‌ప‌ర్వం’.. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్’’ అనేది ట్యాగ్‌లైన్‌.

Viraata Parvam

Viraata Parvam

ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 30న ‘విరాట పర్వం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Viraata Parvam