Virat – Anushka Amazing Dance : ‘ఈ డ్యాన్స్ నా వల్ల కాదు బాబోయ్’ అన్నది ఎవరంటే?

ఎవరు ఏ వృత్తిలో ఉంటే అందులోనే ఎక్కువగా టాలెంట్ చూపించగలరు. రీసెంట్ గా జిమ్ లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ స్టెప్పులు వేశారు. అయితే విరాట్ భార్యతో డ్యాన్స్ చేయలేక నవ్వుతూ పక్కకి తప్పుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Virat – Anushka Amazing Dance : ‘ఈ డ్యాన్స్ నా వల్ల కాదు బాబోయ్’  అన్నది ఎవరంటే?

Virat - Anushka Amazing Dance

Updated On : April 24, 2023 / 5:08 PM IST

Virat – Anushka Amazing Dance :  అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట సోషల్ మీడియాలో తమ పోస్ట్‌లతో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఈ జంట పంజాబీ పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌ను ఆకర్షిస్తోంది.

Virat Kohli: హెచ్ఎస్‌బీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ..

అనుష్క శ్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు భిన్నమైన వృత్తుల్లో బిజీగా ఉన్నా అభిమానులకు మాత్రం అందుబాటులో ఉంటారు. వారు ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్‌కి షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా జిమ్‌లో వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ బిట్ ఒకటి వైరల్ అవుతోంది. అనుష్క, విరాట్‌లు జిమ్‌లోకి కూల్‌గా ఎంట్రీ ఇచ్చారు. పంజాబీ ఆర్టిస్ట్ శుభ్ ఎలివేటెడ్ సాంగ్‌కి స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు. అయితే పాపం విరాట్ అనుష్కతో కలిసి స్టెప్పులు కంటిన్యూ చేయలేక నవ్వుతూ పక్కకి తప్పుకుంటాడు. ఈ వీడియోని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘డాన్స్ పే ఛాన్స్ స్కిల్స్’ అనే ట్యాగ్ లైన్‌తో షేర్ చేసింది.

Virat Kohli: ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. రిషికేష్ ఆశ్రమంలో సేదతీరుతున్న జంట

అనుష్క, విరాట్‌లు కాస్త ఫ్రీ టైం దొరికితే కలిసి జిమ్‌కి వెళ్లడాలు.. కుటుంబంతో కలిసి లంచ్ డేట్‌కి వెళ్లడాలు చేస్తుంటారు. రీసెంట్ గా బెంగళూరులోని శ్రీ సాగర్ సెంట్రల్ టిఫిన్ రూమ్ రెస్టారెంట్‌కి ఈ కపుల్ వెళ్లినపుడు దిగిన ఫోటోని అక్కడి స్టాఫ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవల విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లోముంబై డియోర్ ప్రీ-ఫాల్ ఫ్యాషన్ షోలో తామిద్దరు దిగిన ఫోటోని షేర్ చేసాడు. సో ఇలా ఈ జంట అటు  బిజీగా వృత్తిపరంగా బిజీగా ఉంటూనే ఇటు అభిమానులకు సోషల్ మీడియాలో దగ్గరగా ఉంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)