Vishwak Sen: అశోక వనంలో అర్జున కళ్యాణం ట్రైలర్.. క్లాస్‌తో కట్టిపడేసిన దాస్!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఫలక్‌నుమా దాస్ చిత్రంతో మాస్ హీరోగా ప్రేక్షకుల్లో....

Ashoka Vanamlo Arjuna Kalyanam
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఫలక్‌నుమా దాస్ చిత్రంతో మాస్ హీరోగా ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేసుకున్నాడు ఈ హీరో. అయితే ఇప్పుడు మాస్ అనే పదాన్ని పూర్తిగా పక్కనబెట్టి కేవలం క్లాస్.. పక్కా క్లాస్ ఎంటర్‌టైనర్ మూవీతో మనముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
Vishwak Sen : విశ్వక్‌సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ టీజర్ రిలీజ్
ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు మే 6న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలోని పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఉండటంతో ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో 30 ఏళ్ల పైబడిన ఓ తెలంగాణ యువకుడిగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. కాగా పెళ్లిచూపుల కోసం ఆంధ్రకు అతడి ఫ్యామిలీతో వెళ్తాడు. అక్కడ హీరోయిన్ రుష్కర్ ఢిల్లోన్‌ను చూసి ఇష్టపడతాడు. కానీ ఆమెకు విశ్వక్ సేన్‌తో పెళ్లి ఇష్టం ఉండదు. దీంతో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు మనకు ట్రైలర్‌లోనే చెప్పేశారు చిత్ర యూనిట్.
Vishwak Sen : మెగాస్టార్‌తో పోటీకి సై అంటున్న యువ హీరో
పూర్తి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ చాలా క్లాస్‌గా కనిపించడం ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించింది. అటు హీరోయిన్ కూడా చాలా క్యూట్‌గా ఉండటంతో ఈ సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. విద్యాసాగర్ చింత డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు జేయ్ క్రిష్ సంగీతం అందిస్తున్నాడు. SVCC Digital ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, మే 6న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి మాస్ నుండి క్లాస్‌కు మారిన విశ్వక్ సేన్‌కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.