Viral Video: కొత్తగా కొన్న ఇంటికి తీసుకెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చిన తల్లి.. ఉబ్బితబ్బిబ్బయిపోయిన బాలుడు
లగ్జరీ ఇల్లు కొన్ని ఓ మహిళ తన కుమారుడిని కారులో కూర్చోబెట్టుకుని ఆ ఇంటి వద్దకు తీసుకెళ్లింది. అప్పటివరకు ఆ ఇల్లు తమదేనని చెప్పని ఆ మహిళ చివరకు తన కుమారుడికి ‘ఇది మన ఇల్లే’నంటూ చెప్పి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సమయంలో ఆ పిల్లాడు సంబరపడిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Viral Video: లగ్జరీ ఇల్లు కొన్ని ఓ మహిళ తన కుమారుడిని కారులో కూర్చోబెట్టుకుని ఆ ఇంటి వద్దకు తీసుకెళ్లింది. అప్పటివరకు ఆ ఇల్లు తమదేనని చెప్పని ఆ మహిళ చివరకు తన కుమారుడికి ‘ఇది మన ఇల్లే’నంటూ చెప్పి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సమయంలో ఆ పిల్లాడు సంబరపడిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తన కుమారుడితో పాటు ఆ మహిళ కారులో చాలా దూరం ప్రయాణించింది. ఎక్కడికి తీసుకువెళ్తున్నానన్న విషయం చెప్పలేదు. ఓ ఇంటి ముందు కారు ఆపి ‘మన ఇంటికి స్వాగతం’ అని చెప్పింది. అంత పెద్ద ఇల్లు తమదేనని తెలుసుకున్న ఆ బాలుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.
కన్నీరు ఆపుకోలేకపోయాడు. ఆ బాలుడి సోదరి కూడా అదే కారులో వెనుక సీట్లో ఉంది. మార్టిస్ట్రీ అనే ఇన్ స్టాగ్రాం యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఆ పిల్లాడికి తల్లి ఇచ్చిన సర్‌ప్రైజ్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
View this post on Instagram
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..